Site icon NTV Telugu

Akanda2 : రికార్డ్ స్థాయి ఓటీటీ డీల్!

Akanda2

Akanda2

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘అఖండ 2’. బాలయ్య కెరీర్‌లోనే కాకుండా టాలీవుడ్‌లో కూడా భారీ అంచనాలు సెట్ చేసిన ఈ సినిమా కోసం అభిమానులు, పాన్‌ ఇండియా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత కొన్నాళ్లుగా ఈ చిత్రానికి సంబంధించి ఓటీటీ హక్కులపై పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే “అఖండ 1” స్ట్రీమింగ్ హక్కులు హాట్‌స్టార్‌ దగ్గరే ఉండటంతో, సీక్వెల్‌ కూడా వారే తీసుకుంటారని టాక్‌ వచ్చింది. తాజా సమాచారం ప్రకారం..

Also Read : Priya Marathe : ప్రముఖ నటి కన్నుమూత..

నిజంగానే అఖండ 2 పాన్‌ ఇండియా డిజిటల్ హక్కులు హాట్‌స్టార్‌ భారీ మొత్తానికి క్లోజ్‌ చేసినట్లు తెలుస్తోంది. అంతే కాదు సమాచారం ప్రకారం ఈ డీల్ రూ.80 కోట్ల రూపాయలకు పైగా జరిగిందని అంటున్నారు. దీని వలన అఖండ 2 ఓటీటీ డీల్, తెలుగు సినిమాల జాబితాలోనే కాకుండా దక్షిణ భారత సినీ పరిశ్రమలో కూడా ఒక రికార్డ్ స్థాయి ఒప్పందంగా నిలిచిందని చెప్పాలి. మరోవైపు, బాలయ్య–బోయపాటి కాంబినేషన్ అంటేనే ప్రేక్షకుల్లో ప్రత్యేక క్రేజ్‌. “సింహా”, “లెజెండ్”, “అఖండ” బ్లాక్‌బస్టర్ల తర్వాత వస్తున్న ఈ చిత్రం ఏ స్థాయి విజయాన్ని సాధిస్తుందో అన్న కుతూహలం పెరుగుతుంది.

Exit mobile version