Akash Puri : టాలీవుడ్ లో మాస్ డైరెక్టర్ అయిన పూరి జగన్నాథ్ ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు. వరుసగా ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడుతున్నాడు. ఇస్మార్ట్ శంకర్ మూవీ తర్వాత ఆయనకు హిట్లు లేవు. లైగర్, డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమాలు ప్లాప్ అయ్యాయి. ఇప్పుడు విజయ్ సేతపుతితో పాన్ ఇండియా సినిమాను ప్రకటించాడు. ఈ మూవీ కోసం బాగానే కష్టపడుతున్నాడు పూరి. అయితే ఆయన కొడుకు ఆకాశ్ పూరి కూడా ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడుతున్నాడు. చివరగా చోర్ బజార్ సినిమా చేశాడు. కానీ అది కూడా ప్లాప్ అయింది. నాలుగేళ్లుగా సినిమా అప్డేట్ ఇవ్వకుండా సైలెంట్ అయిపోయాడు.
Read Also : Vijay Devarakonda : అతని మ్యూజిక్ వింటూ ఎమ్మారై స్కాన్ చేయించుకున్నా
వరుసగా కథలు వింటున్నా అతనికి సబ్జెక్ట్ నచ్చట్లేదంట. ఈ క్రమంలోనే పూరి జగన్నాథ్ తాను విజయ్ సేతుపతితో చేసే సినిమాలో ఆకాశ్ ను తీసుకుంటున్నాడంట. హీరో యంగ్ ఏజ్ లో ఉండే పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని.. ఆ పాత్రలో ఆకాశ్ ను తీసుకుంటున్నట్టు సమాచారం. ఇప్పటికే పూరి జగన్నాథ్ ఆ పాత్రలో కొడుకును చూపించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాడంట. ఇలాగైనా కొడుకును హిట్ ట్రాక్ లో పడేయాలని పూరి ఆరాటపడుతున్నట్టు సమాచారం. మరి కొడుకును పూరి జగన్నాథ్ దారిలో పడేస్తాడా లేదా అన్నది చూడాలి.
Read Also : Pawankalyan : ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ పాల్గొనేది అప్పటి నుంచే..!
