AK61: తమిళ్ తంబీలు ఎంతగానో ఎదురుచూసిన క్షణం రానే వచ్చింది.. ఎట్టకేలకు అజిత్ తన 61 వ సినిమాను ప్రకటించాడు. తనకు సూపర్ హిట్ సినిమాలు ఇచ్చిన హెచ్. వినోత్ దర్శకత్వంలోనే అజిత్ తన 61 వ సినిమాను చేస్తున్నాడు. నెరుకొండ పారువై, వలిమై సినిమాల తరువాత వీరి కాంబోలో వస్తున్నా హ్యాట్రిక్ సినిమా ఇది. జీ స్టూడియోస్, బేవ్యూ ప్రాజెక్ట్స్ ఎల్ఎల్ పి బ్యానర్స్ పై బాలీవుడ్ నిర్మాత బోని కపూర్ నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ కోసం అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. తాజాగా అజిత్ సినిమా టైటిల్ ను, ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు ‘తునీవు’ అనే టైటిల్ ను ఖరారు చేశారు.
ఇక నో గట్స్ నో గ్లోరీ అనేది ట్యాగ్ లైన్.. తమిళ్ లో ‘తునీవు’ అంటే దృఢత్వం, స్ట్రాంగ్ అని అర్ధం. ఇక అజిత్ ఫస్ట్ లుక్ పోస్టర్ అదిరిపోయింది. ఒక పొడుగాటి చైర్ లో కూర్చొన్న అజిత్ చేతిలో గన్ పట్టుకొని కళ్లు మూసుకొని దేని గురించో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లు కనిపించాడు. ఇక న్యాచురల్ గా ఉన్న తన తెల్ల గడ్డం, జుట్టుతోనే తాలా కనువిందు చేశాడు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోందని పోస్టర్ తోనే హింట్ ఇచ్చేశాడు డైరెక్టర్. ఇక ఈ సినిమాకు జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. మరి ఈ సినిమాలో అజిత్ సరసన నటించే ముద్దుగుమ్మలు ఎవరో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది.
