Site icon NTV Telugu

Thunivu: ట్రెండ్ అవుతున్న ‘AK’ కారణం ‘SK’

Shiva Karthikeyan

Shiva Karthikeyan

Thunivu: కోలీవుడ్ సినీ అభిమానులు ‘తల అజిత్’ను ప్రేమగా ‘AK’ అని పిలుచుకుంటారు. అజిత్ కుమార్‌ను షార్ట్ ఫామ్‌లో AK అని పిలవడం ఆయన అభిమానులకి చాలా ఇష్టం. సినిమాలు తప్ప ఏ ప్రమోషనల్ ఈవెంట్ లో కనిపించని అజిత్, తాజాగా ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్నాడు. అజిత్ ట్విట్టర్‌లో ట్రెండ్ అవ్వడానికి కారణం యంగ్ హీరో శివ కార్తికేయన్. ఇటీవలే ‘ప్రిన్స్’ సినిమాలో నటించిన శివ కార్తికేయన్, సోషల్ మీడియాలో అజిత్ ని కలిసిన ఫోటో ఒకటి పోస్ట్ చేశాడు. అంతే అజిత్ ఫాన్స్, శివ కార్తికేయన్ ఫాన్స్ కలిసి #AKwithSK అనే హాష్ ట్యాగ్‌ను క్రియేట్ చేసి ట్వీట్స్ చేస్తున్నారు.

Read Also: విదేశాల్లో ఉన్న 10 దేవతామూర్తులు

అజిత్ తో దిగిన ఫోటోని శివ కార్తికేయన్ పోస్ట్ చేస్తూ ‘Met AK sir after long time ❤️ yet another meeting with sir, to cherish for life 🙏👍 Thank you for all the positive words and wishes sir’ అంటూ కోట్ చేశాడు. నిజానికి శివ కార్తికేయన్ పోస్ట్ చేసిన ఈ ఫోటో అక్టోబర్ లోనిది. ఆ టైంలో పోస్ట్ చేస్తే, ‘ప్రిన్స్’ ప్రమోషన్స్ కోసం పోస్ట్ చేసినట్లు ఉంటుందని ఇన్ని రోజులు వెయిట్ చేసి ఇప్పుడు ఆ ఫోటోని శివ కార్తికేయన్ పోస్ట్ చేశాడు. అజిత్ ప్రస్తుతం ‘తునివు’ అనే సినిమా చేస్తున్నాడు. హెచ్. వినోద్ డైరెక్ట్ చేస్తున్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ పొంగల్ కి ఆడియన్స్ ముందుకి రానుంది. ఈ మూవీకి దళపతి విజయ్ నటిస్తున్న ‘వారిసు’ సినిమా నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది. మరి ఈ ‘తల’ ‘దళపతి’ పోటిలో ఎవరు గెలుస్తారో తెలియాలంటే సంక్రాంతి వరకూ ఆగాల్సిందే.

Read Also: Janhvi Kapoor: ఆ నిర్మాత చేసిన పనికి.. నన్ను ద్వేషిస్తున్నారు

Exit mobile version