Site icon NTV Telugu

Ajith: గుర్తుపట్టలేని స్థితిలో స్టార్ హీరో.. మరీ ఇంత దారుణంగానా.. ?

Ajith

Ajith

Ajith: హీరో అంటే ఎలా ఉండాలి.. బాడీ ఫిట్ నెస్, స్టైల్, స్వాగ్.. అస్సలు అభిమానులు చూసి వావ్.. మా హీరో అంటే ఇలా ఉండాలి అని అనుకొనేలా ఉండాలి. ఈ కాలంలో 60 వయస్సు వచ్చినా కూడా హీరోలు తమదైన అవుట్ ఫిట్ తో అదరగొడుతున్నారు. కానీ, కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ మాత్రం నా ఒరిజినాలిటీనే చూపిస్తా అంటూ డిఫరెంట్ లుక్ తో అదరగొడుతున్నాడు. కోలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా అజిత్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అన్న విషయం తెల్సిందే. వైట్ హెయిర్ కు కలర్ వెయ్యకుండా అలాగే సినిమాలు తీస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్నాడు. హీరో అంటే ఇలానే ఉండాలి అనే ఒక పద్దతిని మార్చేశాడు. ఇక ప్రస్తుతం అజిత్ సినిమాలను పక్కన పెట్టి ప్రపంచాన్ని చుట్టే కార్యాక్రమాన్ని తలపెట్టాడు. ఇప్పటికే పలు రాష్ట్రాలను తిరుగుతూ ..అక్కడ జనాలతో.. అక్కడ ఆచారాలను ఫాలో అవుతూ కనిపిస్తూ ఉన్నాడు అజిత్.

Baby Varalakshmi: రేప్ ల వరలక్ష్మి అని అవమానించేవారు.. ఆ సీన్స్ చేసి

ఇక తాజాగా అజిత్ లేటెస్ట్ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ ఫోటో ఎక్కడ తీసుకున్నది అనేది తెలియదు కానీ, సడెన్ గా చూస్తే మాత్రం ఇందులో ఉన్నది అజిత్ అని గుర్తుపట్టడానికి అభిమానులకు చాలా సమయం పడుతుంది అని మాత్రం చెప్పొచ్చు. ఎందుకంటే .. అజిత్ అంత దారుణంగా ఉన్నాడు. నెరిసిన జుట్టు, గడ్డం.. కళ్లకింద ముడతలు.. నలిగిపోయిన ముఖంతో గుర్తుపట్టలేని విధంగా మారిపోయాడు. అజిత్ వయస్సు 52.. కానీ ఈ ఫొటోలో మాత్రం 70 లా కనిపిస్తున్నాడు. దీంతో అతనికి ఏదో హెల్త్ ప్రాబ్లెమ్ ఉందని అభిమానులు కంగారు పడుతున్నారు. ఇంకొందరు ఏమో ప్రయాణాలు చేస్తూ ఉండడంతో ఇలా ముఖం వడిలిపోయిందని చెప్పుకొస్తున్నారు. మరి అజిత్ తన తదుపరి సినిమా సెట్ లో ఎప్పుడు అడుగుపెడతాడు అనేది తెలియాల్సి ఉంది.

Exit mobile version