NTV Telugu Site icon

OTT Updates: అజిత్ ‘వలిమై’ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది

valimai

valimai

త‌మిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ ‘వ‌లిమై’. ఫిబ్రవరి 24న విడుదలైన ఈ మూవీ తమిళనాడులో భారీ కలెక్షన్‌లను సొంతం చేసుకుంది. రెండు రోజుల్లోనే ఈ చిత్రం రూ.100కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి రికార్డు సృష్టించింది. ఈ మూవీ త్వరలోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ప్రముఖ ఓటీటీ జీ5లో ఈనెల 25 నుంచి వలిమై స్ట్రీమింగ్‌ కానుంది. ఈ మేరకు జీ5 సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది.

వలిమై సినిమాలో టాలీవుడ్ యువ హీరో కార్తీకేయ విలన్‌గా న‌టించాడు. హెచ్‌. వినోద్ ద‌ర్శకత్వం వ‌హించిన ఈ చిత్రం పాన్ ఇండియా లెవ‌ల్లో విడుదలైంది. యాక్షన్, సెంటిమెంట్ ప్రధానంగా తెరకెక్కిన ఈ సినిమాను బోనీ క‌పూర్ నిర్మించాడు. ఈ మూవీ తెలుగులో మంచి టాక్ రాబట్టింది. అయితే పోటీగా భీమ్లానాయక్ సినిమా విడుదల కావడంతో తమిళ సినిమాను ప్రేక్షకులు సరిగ్గా పట్టించుకోలేదు. తెలుగులో 2.5 కోట్లతో బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన ఈ చిత్రం ఫైన‌ల్‌గా 2.26కోట్ల క‌లెక్షన్‌లను సాధించింది.