AjithKumar : తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. ఢిల్లీలో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో అజిత్ కుమార్ ఈ అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. ఈ వేడుకకు ఆయన బ్లాక్ కలర్ సూట్ వేసుకున్నారు. ఇందులో ఆయన క్లీన్ షేవ్ చేసి క్లాస్ లుక్ లో మెరిశారు. సినీ రంగంలో ఆయన అందించిన సేవలకు గాను పద్మభూషణ్ అవార్డు అందజేసింది భారత ప్రభుత్వం. బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అజిత్ కుమార్.. ప్రయోగాత్మక సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
Read Also : Balakrishna : పద్మభూషణ్ అవార్డు అందుకున్న నందమూరి బాలకృష్ణ
ఇండస్ట్రీలో ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోగా స్టేటస్ సంపాదించుకున్నారు. ఇప్పటి వరకు ఆయన నటించిన ఎన్నో సినిమాలు తమిళంతో పాటు తెలుగులో కూడా రిలీజ్ అవుతూ వస్తున్నాయి. సౌత్ లో స్టార్ హీరోగా ఉన్న అజిత్ కుమార్.. సినిమాల్లో యాక్షన్ హీరోగా గుర్తింపు పొందారు. రీసెంట్ గానే గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు. అజిత్ కుమార్ తో పాటు నందూమరి బాలకృష్ణ కూడా పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. బాలయ్య పంచెకట్టులో మెరిశారు. ఏడుగురికి పద్మ విభూషణ్, 19 మందికి పద్మ భూషణ్, 113 మందికి పద్మశ్రీ అవార్డులు అందజేశారు.
