NTV Telugu Site icon

Kollywood : ధనుష్ దర్శకత్వంలో అజిత్ కుమార్.?

Ajith Dhanush

Ajith Dhanush

కోలీవుడ్ హీరో ధనుష్ ఓవైపు హీరోగా వరుస సినిమాలు చేస్తూనే మరోవైపు దర్శకుడిగాను వరుస సినిమాలు చేస్తున్నాడు. కోలీవుడ్ లో మరే హీరో చేయని సినిమాలు చేస్తున్నాడు. గతేడాది స్వీయ డైరెక్షన్ లో నటించిన రాయన్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అదే జోష్ లో ఈ ఏడాదిలో మేనల్లుడు హీరోగా ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ సినిమాతో అలరించాడు ధనుష్. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా నడుస్తుంది.

Also Read : Nithiin : ఎల్లమ్మ సినిమాకు బాలీవుడ్ సంగీత ద్వయం

కాగా ప్రస్తుతం తన దర్శకత్వంలో ‘ఇడ్లి కడై’ అనే సినిమా చేస్తున్నాడు ధనుష్. కోలీవుడ్ యంగ్ హీరో అరుణ్ విజయ్ మరో ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. అయితే కోలీవుడ్ లో ఓ వార్త హల్ చల్ చేస్తుంది. అదేమంటే కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా ధనుష్ ఓ సినిమా చేయబోతున్నాడట. ఇందుకు సంబంధించి ధనుష్ ఇటీవల అజిత్ కు కథ కూడా వినిపించగా అందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్టు తమిళ సినీ వర్గాల సమాచారం. ఒకవేళ ఇదే గనుక కార్యరూపం దాల్చితే కోలీవుడ్‌లో ఈ సెన్సేషన్ కాంబో హిస్టరీ క్రియేట్ చేయడం ఖాయం. కోసమేరుపు ఏంటంటే ప్రస్తుతం ఆదిక్ డైరెక్షన్ లో అజిత్‌ నటించిన ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ ఈ నెల 10న విడుదల కానుంది. అదే రోజు ధనుష్ సినిమా ఇడ్లీ కడై రిలీజ్ డేట్ వేశారు. దీంతో సోషల్ మీడియాలో అజిత్ ఫ్యాన్స్, ధనుష్ ఫ్యాన్స్ ఒకరిపై ఒకరు ట్రోలింగ్ చేసుకుంటున్నారు. అయితే ధనుష్ ‘ఇడ్లీ కడై’ వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.