Site icon NTV Telugu

Ajith Kumar : 30 ఇయర్స్ ఇండస్ట్రీ… ఫ్యాన్స్ కు, హేటర్స్ కు స్పెషల్ మెసేజ్

Ajith Receives a fake bomb Threat Call

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అజిత్ హీరోగా నటించిన యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘వాలిమై’ ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. ఇక నేటితో అజిత్ చిత్ర పరిశ్రమలో 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా అజిత్ తన అభిమానులకు, హేటర్స్ కు, ఇతరులకు సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక సందేశం ఇచ్చారు. స్టార్ అజిత్ పర్సనల్ మేనేజర్ సురేష్ చంద్ర సోషల్ మీడియా ద్వారా ఆయన స్పెషల్ నోట్ ను షేర్ చేశారు.

Read Also : BAFTA Awards : లతా మంగేష్కర్ కు ప్రత్యేక నివాళి

“ఫ్యాన్స్, హేటర్స్, న్యూట్రల్స్ ఒకే నాణేనికి 3 వైపులా ఉంటారు. నేను అభిమానుల నుండి ప్రేమను, ద్వేషించే వారి నుండి ద్వేషాన్ని, న్యూట్రల్స్ నుంచి నిష్పాక్షిక అభిప్రాయాలను దయతో అంగీకరిస్తున్నాను. జీవించండి… జీవించనివ్వండి! అన్ కండిషనర్ లవ్ ఫర్ ఎవర్ ! అజిత్ కుమార్” అంటూ అందరిపై ప్రేమను కురిపించారు అజిత్. ప్రస్తుతం ఈ నోట్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. నెటిజన్లు అజిత్ సౌమ్య ప్రవర్తనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక అజిత్ సినిమాల విషయానికొస్తే… ‘వాలిమై’ దర్శకుడు హెచ్.వినోత్‌తో తన తదుపరి చిత్రానికి సిద్ధమవుతున్నాడు. బోనీ కపూర్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించనున్నారు.

Exit mobile version