NTV Telugu Site icon

AK 62: ఆయన ఏం చేసినా సెన్సేషన్ అవుతోంది…

Ak 62

Ak 62

సోషల్ మీడియాలో ట్రెండ్ చెయ్యాలి అంటే ఒక అప్డేట్ ఉండాలి, లేదా ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ ఉండాలి. ఈ రెండు లేకున్నా కేవలం స్పెక్యులేషణ్ తో మాత్రమే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది అంటే అజిత్ కుమార్ కి మాత్రమే సాధ్యం. అజిత్ కుమార్ అకా AK అనే ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వని రోజు ఉండదు, అంతలా ‘తల’ ఫాన్స్ ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తూ ఉంటారు. తాజాగా అజిత్ ఫాన్స్ చేస్తున్న ట్రెండ్ ‘AK 62’. ఇటివలే తునివు సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు అజిత్. కోలీవుడ్ నుంచి ఓవర్సీస్ వరకూ అన్ని సెంటర్స్ లో తునివు సాలిడ్ కలెక్షన్స్ ని రాబట్టింది. ఈ మూవీ అయిపోగానే అజిత్ తన నెక్స్ట్ సినిమాని ఎవరితో చెయ్యబోతున్నాడు అనే డిస్కషన్ స్టార్ట్ అయిపొయింది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో అజిత్ నెక్స్ట్ సినిమా చేస్తున్నాడు.

Read Also: NTR 30: ఎన్టీఆర్ సినిమా కోసం రంగంలోకి దిగుతున్న చియాన్?

AK 62 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లాల్సిన ఈ మూవీని విజ్ఞేశ్ శివన్ డైరెక్ట్ చెయ్యాల్సి ఉంది. త్వరలో అఫీషియల్ అనౌన్స్మెంట్ బయటకి వస్తుంది అనుకుంటున్న టైంలో విజ్ఞేశ్ శివన్ ‘AK 62’ నుంచి తప్పుకున్నాడని సమాచారం. విజ్ఞేశ్ శివన్ ప్లేస్ లో ‘తడం’ సినిమాని తెరకెక్కించిన ‘మగిళ్ తిరుమేణి’ రేస్ లోకి వచ్చాడు. ఇప్పటికే అజిత్ కి కథని కూడా ఒప్పించి, దర్శకుడు లైన్ క్లియర్ చేసుకున్నాడనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. విజ్ఞేశ్ శివన్, మగిళ్ తిరుమేణిల్లో అజిత్ ఎవరితో సినిమా చేస్తున్నాడు అనే కన్ఫర్మేషన్ త్వరలో బయటకి రానుంది. మోస్ట్లీ AK 62 అప్డేట్ ఈ వీక్ లోనే బయటకి రానుంది.

Read Also: Bandla Ganesh: పవన్ కళ్యాణ్ ని వదలలేదు, రవితేజని లేపుతున్నాడు…