Happy Birthday Aishwarya Rai : అందాల అయస్కాంతం… ఐశ్వర్యా రాయ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘ఐశ్వర్య రాయ్ ఓ అందాల అయస్కాంతం’ అనీ కితాబు నిచ్చిన వారెందరో ఉన్నారు. ఈ నాటికీ ఐశ్వర్య అందం కనువిందు చేస్తూనే ఉంది. విశ్వసుందరి కాలేకపోయింది ఐశ్యర్యారాయ్, ప్రపంచసుందరిగానే ఆమె అందంతో బంధాలు వేసింది. విశ్వసుందరిగా నిలచిన సుస్మితా సేన్ కన్నా మిన్నగా ఐశ్వర్యారాయ్ అందం జనాన్ని ఆకర్షించింది. మోడల్ గా ఉన్న సమయంలోనే ఐశ్వర్య అందాన్ని చూసి, ‘దివి నుండి దిగివచ్చిన తారక…’ అనుకున్నారు జనం. వెండితెరపై నటిగా వెలగగానే, తమ అభిప్రాయంలో ఏ మాత్రం పొరపాటు లేదని భావించి, జేజేలు పలికారు.
ఐశ్వర్యారాయ్ 1973 నవంబర్ 1న కర్ణాటకలోని మంగళూరులో జన్మించింది. మెరుపుతీగెలాంటి మేని సొగసుతో ఐశ్వర్యారాయ్ యాడ్ ప్రపంచంలో తనదైన బాణీ పలికించింది. ఆపై ‘మిస్ ఇండియా’ టైటిల్ పోటీలో రన్నరప్ గానే నిలచింది. అయినా, తన అందంపై నమ్మకంతో మళ్ళీ అందాలపోటీల్లో సాగింది. 1994 మిస్ వరల్డ్ గా ఐశ్వర్య నిలచింది. చిత్రమేమిటంటే, మిస్ యూనివర్స్ గా నిలచిన సుస్మితా సేన్ కన్నా మిన్నగా ఐశ్వర్యారాయ్ కు సినిమా అవకాశాలు వచ్చాయి. కానీ, సరైన చిత్రంతో ముందుకు సాగాలని ఆమె ఆశించారు. ఆ సమయంలోనే మణిరత్నం ‘ఇరువర్’ తెరకెక్కిస్తూ అందులో నాయికగా ఐశ్వర్యను ఎంచుకున్నారు. తొలి చిత్రంలో రెండు విభిన్న పాత్రలను పోషించి భళా అనిపించింది ఐశ్వర్య. ఆ సినిమా పరాజయం పాలయింది. హిందీలో నటించిన తొలి చిత్రం ‘ఔర్ ప్యార్ హోగయా’ కూడా ఐశ్వర్య అందం మెరుపులకు తగ్గ విజయాన్ని అందించలేకపోయింది. ఆ సమయంలో శంకర్ తన ‘జీన్స్’లో ఐశ్వర్యారాయ్ తో వైవిధ్యమైన పాత్రను పోషింప చేశారు. ‘జీన్స్’ ఘనవిజయంతో ఐశ్వర్యారాయ్ అందం చిందులు వేసింది. ఆమె డేట్స్ కోసం సినీజనం క్యూ కట్టడం మొదలయింది.
Also Read
- Immortal Success Surprise : ఇమ్మోర్టల్ సక్సెస్ సెలబ్రేషన్స్.. హీరోకు నిర్మాత వెరైటీ గిఫ్ట్! ట్రెండ్ మార్చేశాడుగా..
- Suriya: సింగం ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. సూర్య కొత్త మూవీ టైటిల్, రిలీజ్ డేట్ వచ్చేశాయ్ చూశారా!
- Irumudi Jackpot: ఇరుముడితో రవితేజకు జాక్‌పాట్.. రెమ్యునరేషన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభం! అసలు లెక్కలు ఇవే..
- Toxic తొలిరోజే నెగెటివ్ రివ్యూస్.. యశ్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!
సల్మాన్ ఖాన్, అజయ్ దేవగన్ కాంబినేషన్ లో రూపొందిన ‘హమ్ దిల్ దే చుకే సనమ్’ సినిమా ఐశ్వర్యను మరింత ముందుకు తీసుకు వెళ్ళింది. ఆ చిత్రంలో ఐశ్వర్య ధరించిన దుస్తులను చూడటం కోసం అమ్మాయిలు పరుగులు తీశారు. యువకులు ఆ ప్రేమకథా చిత్రాన్ని వీక్షించి, పులకించి, ఐశ్వర్యను తమ స్వప్నసుందరిగా పట్టాభిషేకం చేసుకున్నారు. తెలుగు చిత్రం ‘రావోయి చందమామ’లో నాగార్జునతో కలసి “లవ్ టు లివ్…” అనే పాటలో నర్తించి మురిపించింది ఐసు. ఈ పాట కోసం అప్పట్లో ఆమె భారీ పారితోషికం అందుకుందని చెప్పేవారు. ఇక ఈ పాట చిత్రీకరణ అన్నపూర్ణ స్టూడియోలో నాలుగు రోజులు చిత్రీకరణ జరుపుకోగా, అన్ని రోజులూ ఆమెను చూడటానికి సినీజనమే క్యూ కట్టడం చూస్తే, తెలుగునాట ఆమెకు ఎంతటి ఫాలోయింగ్ ఉందో అర్థమయింది.
“తాళ్, మేలా, జోష్, హమారే దిల్ ఆప్కే పాస్ హై, మొహబ్బతే, దేవ్ దాస్, ఖాకీ, క్యు హోగయా నా, ధూమ్ -2, జోధా అక్బర్, సర్కార్ రాజ్, గుజారిష్, యే దిల్ హై ముష్కిల్” వంటి హిందీ చిత్రాలలో ఐశ్వర్యారాయ్ అందాలతో బంధాలు వేసింది. అభినయంతోనూ కట్టి పడేసింది. తమిళంలో ఆమె నటించిన ‘యందిరన్’ తెలుగులో ‘రోబో’గా ఘనవిజయం సాధించింది. అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ తో కలసి ‘బంటీ ఔర్ బబ్లీ’లో “కజ్రారే…” సాంగ్ లో ఐశ్వర్యారాయ్ అందాలతో చేసిన కనువిందును ఎవరూ మరచిపోలేరు. భర్త అభిషేక్ తో కలసి ఆమె నటించిన మణిరత్నం ‘గురు’ సైతం ఆకట్టుకుంది. “బ్రైడ్ అండ్ ప్రెజుడైస్, ద మిస్ట్రెస్ ఆఫ్ స్పైసెస్, ప్రొవోక్డ్, ద లాస్ట్ లెజియన్, ద పింక్ పాంథర్-2” వంటి ఇంగ్లిష్ సినిమాల్లోనూ ఐశ్వర్య తన అందాల అభినయంతో మురిపించింది. ఆ మధ్య వచ్చిన ‘యే దిల్ హై ముష్కిల్’లో ఐశ్వర్య అందం చూసి, పెళ్ళయ్యాక ఆమెలో మరింత ఆకర్షణ పెరిగిందని అన్నారు జనం. ప్రస్తుతం ఓ బిడ్డ తల్లయిన తరువాత కూడా ఐశ్వర్య మునుపటి కన్నా మిన్నగా ఆకర్షిస్తూనే ఉంది. మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’లో నందినిగా, ఊమై రాణిగా ఐశ్వర్యారాయ్ ద్విపాత్రాభినయం అలరించింది. మరి రాబోయే చిత్రాలలో ఐశ్వర్య అందం ఏ తీరున బంధాలు వేస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
-
Petrol-Diesel Price: హార్ముజ్‌లో భారీ దాడులు.. వాహనదారులకు ధరలు షాకిచ్చే ఛాన్స్!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!