‘ఐశ్వర్య రాయ్ ఓ అందాల అయస్కాంతం’ అనీ కితాబు నిచ్చిన వారెందరో ఉన్నారు. ఈ నాటికీ ఐశ్వర్య అందం కనువిందు చేస్తూనే ఉంది. విశ్వసుందరి కాలేకపోయింది ఐశ్యర్యారాయ్, ప్రపంచసుందరిగానే ఆమె అందంతో బంధాలు వేసింది. విశ్వసుందరిగా నిలచిన సుస్మితా సేన్ కన్నా మిన్నగా ఐశ్వర్యారాయ్ అందం జనాన్ని ఆకర్షించింది. మోడల్ గా ఉన్న సమయంలోనే ఐశ్వర్య అందాన్ని చూసి, ‘దివి నుండి దిగివచ్చిన తారక…’ అనుకున్నారు జనం. వెండితెరపై నటిగా వెలగగానే, తమ అభిప్రాయంలో ఏ మాత్రం…