Site icon NTV Telugu

Aishwaryaa: విడాకుల తరువాత ధనుష్ భార్య సంచలన వ్యాఖ్యలు..

dhanush

dhanush

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, భార్య ఐశ్వర్య విడిపోయిన సంగతి తెలిసిందే. 18 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ ఇద్దరూ విడిపోతున్నట్లు జనవరిలో సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. ఇక విడాకుల తర్వాత మొదటిసారి ధనుష్ భార్య ఐశ్వర్య స్పందించింది. ఒక ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతూ” ప్రేమ అనేది ఎంతో అద్భుతమైనది. ఒకరి భావాలను మరొకరు వ్యక్తపరుచుకోవడం. ప్రేమ అనేది ఒక వ్యక్తికో, వస్తువుకో సంబంధించింది కాదు.

నేను ఎదిగేకొద్దీ నా మనసులో ప్రేమ నిర్వచనం మారుతూ వస్తుంది. ఇప్పుడు నాకు నా తల్లిదండ్రులు ఇష్టం, నా పిల్లలను నేను ప్రేమిస్తున్నాను.. ఒక వ్యక్తితోనే ప్రేమ ఆగిపోదు” అని చెప్పుకొచ్చింది. ఇటీవల కరోనా నుంచి కోలుకున్నాక వీరిద్దరితో చర్చలు జరిపి ఇద్దరినీ ఒకటి చేస్తామని రజినీ, ధనుష్ తండ్రి చెప్పడంతో మళ్లీ ఈ జంట కలుస్తారని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ఇక ఇప్పుడేమో ఐశ్వర్య ఒక వ్యక్తితోనే ప్రేమ ఆగిపోదు అని అనగానే అభిమానులు వేరే వేరే అర్దాలు తీస్తూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ జంట మళ్లీ కలవనుందా..? లేదా అనేది తెలియాలి.

Exit mobile version