Site icon NTV Telugu

Aishwarya Rajesh: మరో సీనియర్ హీరో సరసన ఐశ్వర్యా రాజేష్?

Aishwarya Rajesh

Aishwarya Rajesh

రీసెంట్‌గా విక్టరీ వెంకటేష్ సరసన “సంక్రాంతికి వస్తున్నాం” చిత్రంతో భారీ విజయాన్ని అందుకుని, టాలీవుడ్‌లో టాలెంటెడ్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య రాజేష్ కెరీర్ ఇప్పుడు ఒక ఆసక్తికరమైన మలుపు తిరగబోతోంది. ఈ ముద్దుగుమ్మ, ఇప్పుడు ఏకంగా టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున ప్రతిష్టాత్మక చిత్రంలో భాగం కాబోతున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. వెంకటేష్‌తో చేసిన సినిమా సూపర్ హిట్ అయినా, ఐశ్వర్యకు ఆశించిన స్థాయిలో టాలీవుడ్ ఆఫర్లు క్యూ కట్టలేదు. ప్రస్తుతం తిరువీర్ సరసన ఒక ప్రాజెక్ట్ చేస్తున్న ఆమెకు, నాగార్జున సినిమా రూపంలో ఒక ‘గోల్డెన్ ఛాన్స్’ తలుపు తట్టిందని సమాచారం. నాగార్జున కెరీర్‌లో ఎంతో ప్రత్యేకమైన 100వ చిత్రంలో ఒక కీలక పాత్ర కోసం ఐశ్వర్య రాజేష్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది.

Also Read:Vijayashanti : ఉద్యమకారుల హామీలపై విజయశాంతి ఫైర్..

ఈ సినిమా కేవలం నాగార్జున 100వ సినిమా కావడం వల్ల మాత్రమే కాదు, ఇందులో నటిస్తున్న తారాగణం వల్ల కూడా విపరీతమైన హైప్ తెచ్చుకుంటోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌లో సీనియర్ నటీమణులు టబు, సుస్మితా సేన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. తమిళ దర్శకుడు రా. కార్తీక్ ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. విశేషమేమిటంటే, నాగార్జున స్వయంగా తన సొంత బ్యానర్‌లో ఈ మైల్ స్టోన్ మూవీని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.

Exit mobile version