King100: నాగార్జున ‘కింగ్ 100’లో మరో స్టార్ హీరోయిన్.. ఐశ్వర్య రాజేష్ ఎంట్రీ కన్ఫర్మ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
King100: టాలీవుడ్ కింగ్ నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మూవీ ‘కింగ్ 100’. ఆయన కెరీర్లో 100వ సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా నాగార్జున పుట్టినరోజు సందర్భంగా విడుదలైన టైటిల్ గ్లింప్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం ఆఫీషియల్ గా బయటకు వచ్చింది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో టాలీవుడ్లో మరోసారి మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ‘కింగ్ 100’లో భాగమని దాదాపుగా కన్ఫర్మ్ అయింది. ఇప్పటివరకు ఆమె ఈ సినిమాలో నటిస్తున్నారనే వార్తలు వినిపించినప్పటికీ, మేకర్స్ మాత్రం అధికారికంగా వెల్లడించలేదు. తాజాగా ఐశ్వర్య రాజేష్ స్వయంగా సినిమా గ్లింప్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆమె ఎంట్రీపై స్పష్టత వచ్చింది. ఆర్.ఏ. కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కింగ్ 100’ను నాగార్జున కెరీర్లో ప్రత్యేకమైన సినిమాగా రూపొందిస్తున్నారు. టైటిల్ గ్లింప్స్‌లోనే నాగార్జునను చాలా స్టైలిష్‌గా, ఎనర్జిటిక్‌గా చూపించడం అభిమానుల్లో ఆసక్తిని పెంచింది.
ఐశ్వర్య రాజేష్ ఈ ప్రాజెక్ట్‌లో భాగమవడం సినిమాకు మరో ప్రత్యేకతను తీసుకొచ్చింది. గతంలోనే ఆమె ‘కింగ్ 100’లో నటిస్తున్నారనే వార్తలు బయటకు వచ్చాయి. అయితే చిత్రబృందం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో అవి కేవలం ప్రచారంగానే మిగిలిపోయాయి. ఇప్పుడు ఐశ్వర్య రాజేష్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ‘కింగ్ 100’ గ్లింప్స్‌ను షేర్ చేయడంతో ఆమె ఈ సినిమాలో ఉన్న విషయం స్పష్టమైంది. నాగార్జున 100వ సినిమాలో ఆయనతో కలిసి తెరపై కనిపించబోతుండటం ఐశ్వర్య రాజేష్ కెరీర్లో కూడా చెప్పుకోదగ్గ అవకాశంగా మారింది. ఇప్పటికే విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ తెలుగు, తమిళ చిత్రాల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ఇప్పుడు టాలీవుడ్‌లోని సీనియర్ స్టార్ హీరోలలో ఒకరైన నాగార్జునతో కలిసి నటించబోతున్నారు. అయితే సినిమాలో ఆమె పాత్ర ఏంటి, కథలో ఆమెకు ఎంత ప్రాధాన్యత ఉంటుంది అనే విషయాలను మాత్రం మేకర్స్ ప్రస్తుతానికి రహస్యంగానే ఉంచారు.
Also Read
- Dulquer Salmaan: "టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా"
- Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
- Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
- Tollywood: చివరి నిమిషంలో బీజీఎంల మార్పు.. పెద్ద సినిమాల్లో కొత్త తలనొప్పులు!
ఐశ్వర్య రాజేష్‌కు తెలుగులో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా మంచి మైలేజ్ ఇచ్చింది. అందులో ఆమె నటనకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఆ తర్వాత వరుసగా తెలుగు ప్రాజెక్టుల్లో అవకాశాలు రావడం ఆమెకు కలిసొస్తోంది. ప్రస్తుతం సుమంత్ హీరోగా నటిస్తున్న ‘మహేంద్రగిరి వరాహి’లో ఆమె కథానాయికగా నటిస్తున్నారు. అంతేకాకుండా దిల్ రాజు నిర్మాణంలో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న మరో సినిమాలో కూడా ఆమె భాగమని సమాచారం. ఈ సినిమా 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇలా వరుస తెలుగు సినిమాలతో బిజీగా మారుతున్న సమయంలోనే ఐశ్వర్య రాజేష్‌కు నాగార్జున 100వ సినిమాలో అవకాశం రావడం ఆసక్తికరంగా మారింది. ఒకవైపు యువ హీరోలతో సినిమాలు చేస్తూనే, మరోవైపు సీనియర్ స్టార్ హీరోల ప్రాజెక్టుల్లో కూడా భాగమవుతూ తన కెరీర్‌ను విభిన్నంగా కొనసాగిస్తున్నారు ఐశ్వర్య.
ఇక ‘కింగ్ 100’లో టబు, సుష్మిత భట్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. టైటిల్ గ్లింప్స్‌లో కనిపించిన విజువల్స్, నాగార్జున లుక్‌తో పాటు సంగీతం కూడా సినిమాపై అంచనాలను పెంచుతోంది. ‘కింగ్ 100’ను 2026 డిసెంబర్ 24న క్రిస్మస్ సీజన్లో థియేటర్లలోకి తీసుకురానున్నారు. అదే సమయంలో పలు భారీ సినిమాలు కూడా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద పోటీ ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. మరి నాగార్జున 100వ సినిమా ఆయన కెరీర్లో ఎలాంటి మైలురాయిగా నిలుస్తుంది, ఐశ్వర్య రాజేష్ పాత్ర ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.
తాజావార్తలు
-
UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!
-
Shreyas Iyer: మేము చెత్తగా ఆడాం, చాలా తప్పులు చేశాం.. న్యూజిలాండ్ ఓటమిపై శ్రేయస్ కీలక వ్యాఖ్యలు!
-
India Renewable Energy Summit 2026: ప్రధాని మోడీ చేతుల మీదుగా.. నేడు ఇండియా రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్ 2026 ప్రారంభం
-
Murusu Cyclone Alert: దూసుకొస్తున్న మురసు తుఫాన్.. నేడు అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు!
-
EPFO WhatsApp Service: EPFO WhatsApp సేవ ప్రారంభం.. ‘Hi’ పంపితే చాలు, PF బ్యాలెన్స్, పాస్‌బుక్ వివరాలు మీ చేతిలో!
ట్రెండింగ్
-
IND vs NZ: వన్డే సిరీస్‌కు ముందు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్స్ సిరీస్ నుండి అవుట్.!
-
SOS బటన్, Family Assist ఫీచర్లtho ‘సీనియర్ సిటిజన్ల’ కోసం Nokia 2360 Flip ఫోన్ లాంచ్..!
-
Jio vs Airtel vs Vi: కేవలం వాయిస్ కాల్స్ కోసమే రీఛార్జ్.. ఏ కంపెనీ ప్లాన్ బెస్ట్.?
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు