Site icon NTV Telugu

పనామా పేపర్స్ లీక్ కేసులో ఐష్… 5 గంటలు ఈడీ విచారణ

Aishwarya-rai

పనామా పేపర్ లీక్ కేసుకు సంబంధించి విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన ఆరోపణలపై బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు ​​జారీ చేసింది. వాస్తవానికి నవంబర్ 9, 2021న ఈడీ ముందు హాజరు కావాల్సిందిగా ఐశ్వర్యను అడిగారు. కానీ ఆమె వ్యక్తిగత కారణాలను చూపుతూ విచారణను దాటవేశారు. అయితే మళ్లీ ఈడీ నోటీసులు అందజేసి డిసెంబర్ 20న విచారణకు పిలిచింది. నిన్న ఉదయం న్యూఢిల్లీలో దిగిన ఐశ్వర్య నేరుగా ఈడీ ప్రధాన కార్యాలయానికి చేరుకుంది. ఫారెక్స్ నిబంధనలను ఉల్లంఘించి విదేశాల్లో సంపదను దాచుకున్నారనే ఆరోపణలను ఆమె ఎదుర్కొంటున్నారు.

https://ntvtelugu.com/samantha-comments-on-her-item-song-in-pushpa/

దాదాపు ఐదు గంటల పాటు ఈడీ ఐశ్వర్యను ప్రశ్నించింది. ఆమె విదేశీ ప్రయాణ చరిత్రపై ఈడీ విచారణ చేపట్టింది. లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (ఎల్‌ఆర్‌ఎస్)ని ఉపయోగించి తన భర్త అభిషేక్ బచ్చన్ విదేశీ బ్యాంకు ఖాతాలో చేసిన పెద్ద డిపాజిట్‌పై కూడా ఐష్ ను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. మరి ఈ విచారణలో ఈడీ ఎలాంటి వివరాలు రాబట్టింది అనేది ఆసక్తికరంగా మారింది. 2016లో పనామా పేపర్లు లీక్ కాగా అందులో 500 మంది భారతీయ ప్రముఖుల పేర్లు ఉన్నాయి. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ పేరు కూడా అందులో భాగమైంది. అయితే సీనియర్ బచ్చన్ మాత్రం తాను ఎలాంటి తప్పు చేయలేదని ఖండించారు.

Exit mobile version