Site icon NTV Telugu

ఐశ్వర్యారాయ్ “పొన్నియన్ సెల్వన్” లుక్ లీక్

Ponniyan Selvan

అందాల తార ఐశ్వర్యారాయ్ ప్రస్తుతం “పొన్నియన్ సెల్వన్” చిత్రంలో నటిస్తోంది. మణిరత్నం ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఐశ్వర్య, మణిరత్నం కాకలిసి మంచి హిట్‌లు అందించారు. “పొన్నియన్ సెల్వన్”తో చాలాకాలం తరువాత సౌత్ స్క్రీన్స్ పై మెరవడానికి సిద్ధమవుతోంది ఐష్. అంతేకాకుండా ఈ సినిమాలో భారీ తారాగణం ఉండడంతో సినిమాపై ఆసక్తిగా ఉన్నారు ప్రేక్షకులు. ఈ నేపథ్యంలో సినిమా సెట్స్ నుంచి ఐశ్వర్య లుక్ బయటకు వచ్చింది. ఈ పిక్ లో ఐశ్వర్య ఎరుపు రంగు పట్టు చీర, భారీ బంగారు ఆభరణాలను ధరించింది. ఈ లుక్‌లో ఐశ్వర్య రాణిలాగా కన్పిస్తోంది.

మరో ఆసక్తికర విషయం ఏమంటే ఐష్ ఇందులో తల్లీకూతుళ్లుగా ద్విపాత్రాభినయం చేయబోతోంది. మందాకిని అనే తల్లి పాత్ర, నందిని అనే కూతురు పాత్ర. సెట్లో గాలి కోసం ఆమె చేతిలో ఫ్యాన్ పట్టుకుని ఉంది. చిత్ర బృందం మొత్తం ఐశ్వర్య చుట్టూ కనిపిస్తుంది. ఈ చిత్రంలో ఐశ్వర్యతో పాటు విక్రమ్, కార్తీ, త్రిష కృష్ణ, ప్రకాష్ రాజ్, జైరామ్ రవి, ఐశ్వర్యలక్ష్మి తదితరులు. ఈ సినిమాను మణిరత్నం 1995లో కల్కి కృష్ణమూర్తి రాసిన దక్షిణాన పవర్ ఫుల్ రాజు రాజరాజ చోళుని కథ “పొన్నియన్ సెల్వన్” నవల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ గా రవివర్మన్ వర్క్ చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఈ సినిమా షూటింగ్ కోసం ఐశ్వర్య మధ్యప్రదేశ్ వెళ్లింది. ఇటీవల ఆమె ముంబైకి తిరిగి వచ్చింది.

Read Also : డ్రగ్స్ కేసులో కీలక మలుపు… ఆ హీరోయిన్ల బెయిల్ రద్దు…?

చాలా సంవత్సరాల తరువాత ఐశ్వర్య ఈ చిత్రం ద్వారా మణిరత్నం దర్శకత్వంలో నటిస్తోంది. అంతకుముందు వీరిద్దరి కాంబినేషన్ లో రావణ్, గురు వంటి చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు ముచ్చటగా మూడవసారి ఈ లెజెండ్స్ కాంబో రాబోతోంది. ఐశ్వర్య చివరిసారిగా 2018 సంవత్సరంలో “ఫెన్నే ఖాన్” చిత్రంలో కకన్పించింది. ఇందులో అనిల్ కపూర్, రాజ్‌కుమార్ రావు కూడా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది.

మరోవైపు గత కొన్ని రోజులుగా ఐశ్వర్య ప్రెగ్నెన్సీ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దానికి ప్రత్యేక కారణం కూడా ఉంది. ఈ బ్యూటీ ఈమధ్య ఎక్కడ కన్పించినా ఆమె డ్రెస్ సెన్స్ లో మార్పు కన్పిస్తోంది. పద్ధతిగా, లూజ్ గా ఉండే దుస్తుల్లో కన్పిస్తున్న ఐశ్వర్య గర్భవతి అంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై ఆమె కుటుంబం అస్సలు స్పందించలేదు. దీంతో ఈ వార్తలు అబద్ధమని, గర్భవతి అయితే సినిమా షూటింగ్ లో ఎందుకు పాల్గొంటుంది అంటూ ఆమె అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

Exit mobile version