కరోనా విజృంభణ, లాక్ డౌన్స్, ఇంకా ఇతర సమస్యల మధ్య చాలా భారీ చిత్రాలు నత్తనడకన సాగుతున్నాయి. తెలుగు, తమిళం, హిందీ అన్న తేడా లేకుండా అంతటా ఒకే స్థితి. అయితే, సెకండ్ వేవ్ తరువాత చాలా మంది ఫిల్మ్ మేకర్స్ కాస్త వేగం పెంచారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే తమ సినిమాలు పూర్తి చేసే తొందరలో ఉన్నారు. మణిరత్నం కూడా అదే ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఆయన తలపెట్టిన మ్యాగ్నమ్ ఓపన్ హిస్టారికల్ సాగా ‘పొన్నియన్ సెల్వన్’ దాదాపుగా చివరి దశకు వచ్చేసింది. రీసెంట్ గా పుదుచ్చేరిలో ఓ షెడ్యూల్ ముగించారు. ఐశ్వర్య రాయ్ సహా ప్రధాన తారాగణం అంతా పాల్గొన్నారు…
Read Also : సెప్టెంబర్ లో “సైమా” అవార్డ్స్
పుదుచ్చేరి షెడ్యూల్ తరువాత ఇప్పుడు హైద్రాబాద్ ఫైనల్ షూట్ కు సిద్ధమవుతోంది టీమ్ ‘పొన్నియన్ సెల్వన్’. రాజుల కాలం నాటి రాజకీయ కథతో రూపొందుతోన్న ఈ పీరియాడికల్ మూవీలో ఐష్ రెండు పాత్రలు చేస్తోంది. యువరాణి నందిని, ఆమె తల్లి మహారాణి మీనాక్షి దేవీ క్యారెక్టర్స్ లో కనిపిస్తుందట! చివరి షెడ్యూల్ లో భాగంగా హైద్రాబాద్ లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటూ ఒక పాటని కూడా చిత్రీకరించబోతున్నారు. చూడాలి మరి, ఇప్పటికే అనుకున్న దాని కంటే ఆలస్యమైన మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియన్ సెల్వన్’ జనం ముందుకు ఎప్పుడు వస్తుందో…
