NTV Telugu Site icon

Aishwarya Rai Bachchan: కళ్లు పెట్టి చూడండి మిత్రోన్.. ఇక వారికి విడాకులు ఇచ్చే పని ఆపండి

Ish

Ish

Aishwarya Rai Bachchan: సెలబ్రెటీల పెళ్లిళ్లు ఎప్పుడు జరుగుతాయో.. ఎప్పుడు పెటాకులు అవుతాయో చెప్పడం చాలా కష్టం. నిత్యం కలిసి మీడియా ముందుకు కనిపించే జంట.. కొన్నిరోజులు సింగిల్ గా కనిపిస్తే.. వారి మధ్య విబేధాలు ఉన్నట్టు ఉన్నాయి అని గాసిప్స్ పుట్టించేస్తున్నారు. ఇక ఎప్పటినుంచో బాలీవుడ్ అడోరబుల్ కపుల్ అభిషేక్ బచ్చన్- ఐశ్వర్య రాయ్ బచ్చన్.. మధ్య విబేధాలు నెలకొన్నాయని, వారు విడాకులు కూడా తీసుకోబోతున్నారు అనే రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఇక కొద్దిరోజుల ముందు ఐష్.. ఎక్కడికి వెళ్లినా ఒంటరిగానే కనిపించింది. ముద్దుల కూతురు ఆరాధ్య చెయ్యి పట్టుకొని నడిపిస్తూ కనిపించేదే కానీ, పక్కన అభిషేక్ ఎప్పుడు కనిపించలేదు. దీంతో వీరి మధ్య మళ్లీ గొడవ మొదలయ్యింది.. త్వరలోనే వీరు విడిపోతున్నారు అంటూ బాలీవుడ్ మీడియా కోడై కూసింది.

#Nani30: నాని చిత్రంలో శ్రుతిహాసన్!

ఇక ప్రతిసారి ఇలాంటి రూమర్స్ ను అభిషేక్ బచ్చన్ ఖండిస్తూనే వస్తున్నాడు. ఈ మధ్యనే ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా కొంచెం ఘాటుగానే రిప్లై ఇచ్చాడు. ఇక అక్కడితో ఈ రూమర్స్ కు చెక్ పడినట్లే అని అనుకున్నా.. ఈ జంట బయట ఎక్కడా కనిపించకపోయేసరికి అనుమానాలు.. అనుమానాలుగానే మిగిలిపోయాయి.
ఇక తాజాగా ఆ అనుమానాలు పటాపంచలు చేశారు ఈ జంట. తాజాగా PS2 సక్సెస్ సెలబ్రేషన్స్ లోఐష్- అభిషేక్ జంటగా కనిపించి షాక్ ఇచ్చారు. ఐశ్వర్య రాయ్ నటించిన PS2 ఈ శుక్రవారం రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకున్న విషయం తెల్సిందే. దీంతో చిత్ర బృందం వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకలో అభిషేక్- ఐశ్వర్య- ఆరాధ్య సందడి చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇకనుంచి అయినా ఈ జంట విడాకుల రూమర్స్ ఆపితే బావుంటుంది అని అభిమానులు చెప్పుకొస్తున్నారు.