NTV Telugu Site icon

Ponniyin Selvan: వారిపై ద్వేషం.. ప్రతీకారం తీర్చుకోనున్న ఐశ్వర్య రాయ్..?

Aish

Aish

Ponniyin Selvan: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో భారీ తారాగణం నటించిన చిత్రం పొన్నియన్ సెల్వన్. 1950 లో కల్కి రాసిన పొన్నియన్ సెల్వన్ అనే పుస్తకఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాడు మణిరత్నం. విక్రమ్, జయం రవి, కార్తీ, విక్రమ్ ప్రభు, ప్రకాష్ రాజ్, ఐశ్వర్య రాయ్, త్రిష, శోభితా ధూళిపాళ్ల లాంటి వారందరూ ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లో భాగమయ్యారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి భాగం సెప్టెంబర్ 30 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తెలుగులో అంత బజ్ లేకపోయినా తమిళ్ లో మాత్రం మరో బాహుబలి అని అంటున్నారు. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ సినిమాకు హైలైట్ ఐశ్వర్య రాయ్ పాత్ర అని తెలుస్తోంది. ఆమె ఇందులో రెండువిభిన్నమైన పాత్రల్లో నటిస్తోంది. ముఖ్యంగా నందిని అనే నెగెటివ్ రోల్ ప్రధాన ఆకర్షణగా నిలువనున్నదట.

పాండ్య రాజును ప్రేమించిన నందిని కళ్లముందే చోళ రాజు అయిన ఆదిత్య కరికలాన్ అతడి శిరస్సును ఖండించి చంపుతాడు. ప్రేమించినవాడిని చంపినవారిపై ద్వేషంతో రగిలిపోయిన నందిని.. చోళ రాజుల పతనానికి ఎలా కారణం అయ్యింది..?. వారిపై ప్రతీకారం ఎలా తీర్చుకొంది అనేది చాలా ఆసక్తిగా చూపించాడట మణిరత్నం. ఇక నెగెటివ్ రోల్ లో అందాల భామ ఐశ్వర్య అదరగొట్టేసిందని తెలుస్తోంది. ఆమె కోసం, ఆమె అందం కోసం ఎంతటి రాజు అయినా పిచ్చెక్కిపోయేలా ఆమె అలంకరణ ఉండనున్నదట. అంతేకాకుండా ఆమె పాత్రను నరసింహా చిత్రంలో రమ్యకృష్ణ నటించిన నీలాంబరీ పాత్రతో పోల్చడం విశేషం. సూపర్ స్టార్ రజినీనే ఈ విషయాన్నీ స్వయంగా చెప్పడంతో ఐశ్వర్య పాత్రపై మరింత హైప్ క్రియేట్ అయ్యింది. ఎన్నో ఏళ్ళ తరువాత ఐశ్వర్య తెలుగు, తమిళ్ ప్రేక్షకులకు కనిపిస్తోంది. మరి ఈ సినిమాతో ఈ భామకు ఎలాంటి హిట్ రానుందో చూడాలి.

Show comments