Site icon NTV Telugu

Coolie : ‘చికిటు’ తెలుగు లిప్ సింక్ కోసం AI టెక్నాలజీ

Coolie

Coolie

కోలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్ చిత్రం కూలీ. ఆగస్టు 14న బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు ప్రిపేరవుతోంది. రజనీకాంత్ మేనియా, లోకేశ్ కనగరాజ్ మేకింగ్, అనిరుధ్ బాణీలు, మల్టీ స్టారర్స్ కూలీపై అంచనాలు డబుల్ కాదు త్రిబుల్ చేశాయి. వార్ 2తో పోటీ పడుతోన్న ఈ మూవీ.. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో చికిటు సాంగ్ రిలీజ్ చేసింది. ప్రజెంట్ ట్రెండింగ్‌లో ఉంది. ఒకప్పటి డైరెక్టర్ కమ్ యాక్టర్ కమ్ కంపోజర్ టి రాజేందర్ సాంగ్ ఆలపించడంతో పాటు డ్యాన్స్ ఫ్యాన్స్ కు ఫీస్ట్ అందించాయి.

Also Read : JIGRIS : మ్యాడ్ బాయ్ రామ్ నితిన్ ‘జిగ్రీస్’ ఫస్ట్ లుక్ రిలీజ్

70 ఏళ్ల వయస్సులో టి రాజేందర్ సాంగ్ పాడటమే ఓ ఎత్తైతే.. ఆ పాటకు అదిరిపోయే స్టెప్స్ వేయడాన్ని ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్. కాగా చికిటు వైబ్ సాంగ్ ను తెలుగులోను రిలీజ్ చేసారు. అయితే తెలుగు లిరికల్ విడియో ఒకింత ఆశర్యం కలిగించింది. సాంగ్ లోని లిరిక్స్ కు అనిరుధ్ వాయిస్ లిప్ సింక్ పర్ఫెక్ట్ గా కుదిరింది. సాధారణంగా సాంగ్ లో ఎన్ని భాషల్లో పాడిన కూడా లిరికల్ వీడియోలో మాత్రం ఒరిజినల్ సాంగ్ లో షూట్ చేసిన లిప్ సింక్ ఉంటుంది. కానీ కూలీ కోసం సరికొత్త AI టెక్నాలజీ ఉపయోగించి తెలుగు భాషలో వచ్చే లిరిక్స్ కు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యేలా రూపొందించారు మేకర్స్. రాను రాను AI టెక్నాలజీ సినిమాలలో వాడకం ఎక్కువ అయింది. కొన్ని కొన్ని సినిమాలలో హీరో యంగ్ ఏజ్ లుక్ కోసం   AI టెక్నాలజీను వాడుతున్నారు. ఇప్పుడు ఏకంగా సాంగ్ మొత్తం లిప్ సింక్ చేసేసారు.

Exit mobile version