NTV Telugu Site icon

Ahimsa: ఏందీ బ్రో.. బయట టాక్ చూస్తే అలా.. వీళ్లు చూస్తే ఇలా

Teja

Teja

Ahimsa: డైరెక్టర్ తేజ చాలా గ్యాప్ తరువాత అహింస సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దగ్గుబాటి వారసుడు అభిరామ్ ను హీరోగా టాలీవుడ్ కు పరిచయం చేస్తూ తేజ .. తన పంథాలోనే సినిమా తీశాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ మంచి ఆసక్తినే క్రియేట్ చేసాయి. ఇక ఎన్నో అంచనాల మధ్య నేడు రిలీజ్ అయ్యిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను అందుకుంది.కొంతమంది సినిమాలో మొత్తం హింసనే చూపించారు అని చెప్తుండగా.. మరికొంతమంది అసలు కథలో కొత్తదనం లేదని చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా అభిరామ్ నటనలో ఇంకా మ్యాచురిటీ చూపించాల్సిన అవసరం ఉందని, అతని లుక్ లో ఏ మాత్రం హీరో ఛాయలు కనిపించడం లేదని తేల్చేస్తున్నారు. ఇక ఈ టాక్ ను పట్టించుకోకుండా అహింస టీమ్ మాత్రం సినిమా హిట్ అని కేక్ కట్ చేయడం ఆశ్చర్యంగా ఉందని అంటున్నారు. అక్కడ కేక్ కట్ చేసిన వారందరిని తేజ .. సినిమా ఎలా ఉంది అని అడగడం.. వారు చాలా బావుందని చెప్పడం విశేషం. అయితే ఇక్కడ ఎవరి మాటలు నమ్మాలి అనేది మాత్రం మిస్టరీగా మారింది.

Sirf Ek Banda Kafi Hai Trailer: ‘ది ఫ్యామిలీ మ్యాన్’ హీరో.. ఎక్కడ దొరుకుతాయి సామీ నీకు ఇలాంటి కథలు

నిజం చెప్పాలంటే .. ఈ కాలంలో సినిమా హిట్టా..? ఫట్టా..? అనేది రిలీజ్ రోజు మొదటి ప్రీమియర్ షో పడినప్పుడే తెలిసిపోతుంది. మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా కలక్షన్స్ రాబట్టేవి కొన్ని సినిమాలు అయితే.. మరికొన్ని సినిమాలు మారం మిక్స్డ్ టాక్ ను అందుకొని రెండు రోజులకే మరుగున పడిపోయే రకం. తేజ సినిమా అంటే.. మినిమమ్ ఎక్స్ పెక్టేషన్ తో వెళ్లడం తెల్సిందే. కానీ, ఈ సినిమా మాత్రం హింసను కావాలని వెతుకుంటూ వెళ్లనట్లు ఉందని ప్రేక్షకులు చెప్పడం విశేషం. మరి అన్ని చెప్పే తేజకు తన సినిమా ఎలాంటి టాక్ అందుకున్నదో తెలియకుండానే సక్సెస్ అని చెప్పి కేక్ కట్ చేశాడా..? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరి ఈ వీకెండ్ లో ఏమైనా కలక్షన్స్ రాబడితే తప్ప అహింస.. థియేటర్ లో ఉండదు అని మాత్రం నిక్కచ్చిగా చెప్పొచ్చు.