Site icon NTV Telugu

Bollywood : డిజాస్టర్ దర్శకుడితో రూ. 500 కోట్ల హీరో..

Bollywood

Bollywood

మోహిత్ సూరీ, యశ్ రాజ్ ఫిల్మ్స్ అనే బ్రాండ్ తప్ప పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ఫిల్మ్ సైయారా. న్యూ యంగ్‌స్టర్స్‌ అహన్ పాండే, అనీత్ పద్దాలతో లవ్ అండ్ రొమాన్స్ చేయించి హిట్ కొట్టేశారు ఫిల్మ్ మేకర్స్. ఇలాంటి హార్ట్ మెల్ట్ చేసే మూవీని చూసి చాలా కాలం కావడంతో పాటు, ఫ్రెష్‌ కాన్సెప్ట్‌, టీనేజ్ లవ్‌స్టోరీ కావడంతో బాగా కనెక్టైన ఆడియన్స్ రూ. 500 కోట్లు కట్టబెట్టారు. దీంతో అహన్ పాండే, అనీత్ పద్దాలకు యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.

Also Read : STR49 : శింబు – వెట్రిమారన్ కాంబో.. టైటిల్ పోస్టర్ రిలీజ్.. కింగ్ ఈజ్ బ్యాక్

సైయారా హిట్ తో అనీత్ పద్దాని గోల్డెన్ ఆపర్చునిటీ వరించిందని టాక్. మడాక్ హారర్ సినిమాటిక్ ఫిల్మ్స్ తెరకెక్కిస్తోన్న శక్తి షాలినిలో కియారా అద్వానీ ప్లేస్‌, అనీత్ పద్దా కొట్టేసిందని టాక్. అలాగే న్యాయ అనే ఓటీటీ సిరీస్‌లోకి స్టెప్ ఇన్ అయినట్లు సమాచారం. ఇవి కాకుండా మరో స్టోరీ డిస్కషన్‌లో ఉందని తెలుస్తోంది. కానీ సైయారా హిట్ తర్వాత అహన్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేయలేదు. బీటౌన్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఆలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో అనీత్ పద్దాని సినిమా చేయబోతున్నాడట. రీసెంట్‌గా అలీ ‘బడే మియా చోటే మియా’ తో భారీ ఫెయిల్యూర్ చూశాడు. కానీ వన్స్ ఆపాన్ ఎ టైం యశ్ రాజ్ ఫిల్మ్స్ కు మంచి హిట్స్ ఇచ్చాడన్న నమ్మకంతో మరో ఛాన్స్ ఇచ్చాడు ఆదిత్య చోప్రా. అహన్ పాండే సరసన మరో యంగ్ బ్యూటీని సెట్ చేశారట. ఈసినిమా నెక్ట్స్ ఇయర్ నుండి సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉందని సమాచారం. రూ. 500 కోట్ల హిట్ ఇచ్చి ఇప్పుడు డిజాస్టర్ డైరెక్టర్ తో సినిమా చేస్తుండడం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

Exit mobile version