ప్రస్తుతం ఉన్న ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో అతి తక్కువ మొత్తానికి వినోదాన్ని అందిస్తున్న సంస్థ ఆహా! కేవలం 299 రూపాయలతో యేడాది పాటు కంటెంట్ ను చూసే సౌకర్యం ఉంది. అయితే వ్యూవర్స్ ను మరింతగా పెంచుకునేందుకు తాజాగా ఆహా ఓ కొత్త ఆకర్షణీయమైన ప్లాన్ తో వచ్చింది. మూడు నెలల పాటు నాన్ స్టాప్ ఎంటర్ టైన్ మెంట్ ను కేవలం రూ. 99 రూపాయలతో పొందే వెసులుబాటు కల్పిస్తోంది. ఈ మొత్తంతో ఆహాలోని సినిమాలు, వెబ్ సీరిస్, షోస్ అన్నీ చూసేయొచ్చు. మరీ ముఖ్యంగా ఇటీవల వచ్చిన కొత్త సినిమాలను వ్యూవర్స్ చూడటం కోసం ఈ ఆఫర్ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. అయితే జూన్ నెలాఖరు వరకూ ఈ ప్లాన్ అందులో బాటులో ఉంటుంది. సో.. రూ. 99 రూపాయలు పే చేసి వచ్చే మూడు నెలల్లో ఆహా లోని కంటెంట్ మొత్తాన్నీ వాచ్ చేసేయండి!
