Site icon NTV Telugu

Aha Naa Pellanta: ఓటిటీలో అదరగొడుతున్న ‘అహ నా పెళ్ళంట’..

Raj

Raj

Aha Naa Pellanta: రాజ్ తరుణ్, శివానీ రాజశేఖర్ జంటగా సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన వెబ్ సిరీస్ అహ నా పెళ్ళంట. ఫ్యామిలీ రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ నవంబర్ 17 నుంచి జీ 5లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఓ పాతికేళ్ల యువ‌కుడు పెళ్లి చేసుకోవాల‌నుకుంటాడు. అయితే ఆక్ర‌మంలో అత‌ను ఎదుర్కొన్న స‌మ‌స్యలేంట‌నేదే అస‌లు క‌థ‌. మ‌న క‌థానాయ‌కుడు పెళ్లి చేసుకోవాల‌నుకున్న‌ పెళ్లి కూతురు త‌న ప్రేమికుడు వెళ్లిపోతుంది. అప్పుడు మ‌న హీరో ఆమెపై ప్ర‌తీకారం తీర్చుకోవాలనుకుంటాడు. తీరా ఆ క‌థ ఎలాంటి మ‌లుపులు తీసుకుంద‌నేదే సినిమా.

కామెడీ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ అందుకొని మంచి విజయాన్ని అందుకుంది. 8 ఎపిసోడ్స్‌తో రూపొందిన అహ నా పెళ్ళంట వెబ్ సిరీస్ విశేష‌మైన ఆడియెన్స్ ఆద‌ర‌ణ పొందుతూ ఇప్ప‌టికే 75 మిలియ‌న్స్ వ్యూయింగ్ మినిట్స్‌ను సాధించింది. ఇక ఈ సక్సెస్ ను చిత్ర బృందం సెలబ్రేట్ చేసుకొంటుంది. ఈ సెలబ్రేషన్స్ లో లావ‌ణ్య త్రిపాఠి, ఆది సాయికుమార్‌, రాజా చెంబోలు కూడా జాయిన్ అయ్యారు. బ్లాస్టింగ్ పార్టీని టీమ్ ఎంజాయ్ చేస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ సిరీస్ తరువాత రాజ్ తరుణ్ ఒక కొత్త సినిమాను ప్రకటించాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. మరి ఈ సిరీస్ తో అందుకున్న విజయాన్ని రాజ్ తరుణ్ కంటిన్యూ చేస్తాడా..? లేదా..? అనేది చూడాలి.

Exit mobile version