NTV Telugu Site icon

Ashok Selvan: ఆహాలో అడల్ట్ కామెడీ థ్రిల్లర్ ‘మన్మథలీల’!

New Project (23)

New Project (23)

 

కమల్ హాసన్ ప్రధాన పాత్రధారిగా ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్ రూపొందించిన తమిళ చిత్రం ‘మన్మథలీల’ 1976లో విడుదలై ఘన విజయం సాధించింది. తెలుగులోనూ ఈ మూవీ డబ్ అయ్యి ప్రేక్షకాదరణ పొందింది. విశేషం ఏమంటే ఇప్పుడు అదే పేరుతో దర్శకుడు వెంకట్ ప్రభు ఓ తమిళ చిత్రం తెరకెక్కించాడు. ‘మన్మథ లీల’ అనే ఈ బ్లాక్ కామెడీ థ్రిల్లర్ మూవీలో అశోక్ సెల్వన్ హీరోగా నటించగా, సంయుక్త హెగ్డే, రియా సుమన్, చంద్రన్, జయప్రకాశ్‌, స్మృతి వెంకట్ కీలక పాత్రలు పోషించారు.

ఈ యేడాది ఏప్రిల్ 1న ఈ మూవీ తమిళంలో విడుదలైంది. 2010 – 2020 మధ్య జరిగే ఈ కథను నాన్ లీనియర్ వే లో దర్శకుడు చూపించాడు. డబ్బున్న కుటుంబానికి చెందిన కాలేజీ విద్యార్థి సత్య స్త్రీలోలుడు కావడంతో అతని జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందన్నదే ఈ సినిమా. దీనికి ప్రేమ్ జీ అమరన్ సంగీతాన్ని సమకూర్చగా, తమిళ ఎ అళగన్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ అడల్ట్ కామెడీ మూవీ ఈ నెల 24న ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది.