Site icon NTV Telugu

Agent : అక్కినేని ఫ్యాన్స్ కు నిర్మాత సారీ !!

Akhil

Akhil

యంగ్ హీరో అఖిల్ అక్కినేని ప్రస్తుతం యాక్షన్ ఎంటర్‌టైనర్ “ఏజెంట్” షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. మావరిక్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రేజీ కాంబోలో తెరకెక్కుతున్న మొదటి సినిమా ఇదే కాగా, ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ కారణంగా “ఏజెంట్”పై భారీ హైప్ నెలకొంది. ఇక ఈరోజు అఖిల్ బర్త్ డే. ఈ సందర్భంగా అక్కినేని అభిమానులంతా “ఏజెంట్” మూవీ నుంచి టీజర్‌ను విడుదల చేయవచ్చని ఆశించారు. కానీ వాళ్ళ ఆశలపై నీళ్లు చల్లుతూ మేకర్స్ ఓ పోస్టర్ తో సరిపెట్టేశారు. అయితే పోస్టర్ ను విడుదల చేయడానికి ముందే “ఏజెంట్” నిర్మాత టీజర్ ను విడుదల చేయట్లేదని, అక్కినేని అభిమానుల ఆశలను నీరుగార్చినందుకు సారీ చెబుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు.

Read Also : Mahesh Babu : గోల్డెన్ హార్ట్… 30 మంది చిన్నారుల జీవితాల్లో వెలుగు

“ఈరోజు టీజర్ రిలీజ్ చేయలేకపోతున్నందుకు అక్కినేని అభిమానులందరికీ సారీ. మేము మీకు బెస్ట్ నే అందించాలని అనుకుంటున్నాము. మీ నిరీక్షణకు తగిన వాల్యూతో… అత్యున్నత నాణ్యతతో కూడిన థియేట్రికల్ టీజర్‌ని మేలో విడుదల చేస్తామని హామీ ఇస్తున్నాం” అంటూ పోస్ట్ చేశారు నిర్మాత అనిల్ సుంకర. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ అండ్ సురేందర్ 2 సినిమా బ్యానర్ లపై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌లో సాక్షి వైద్య కథానాయికగా కనిపించనుంది. ఈ చిత్రం ఆగస్ట్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version