Akhil Akkineni: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తరువాత అఖిల్ అక్కినేని వెండితెరపై కనిపించిందే లేదు. ఇక ప్రస్తుతం అఖిల్ నటిస్తున్న చిత్రం ఏజెంట్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, స్పెషల్ వీడియోస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు ఏప్రిల్ 28 న ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై అఖిల్ అభిమానులు భారీ అంచనాలనే పెట్టుకున్నారు.
Venkatesh: వెంకీమామ ఫేవరేట్ హీరో.. ఆయన కోసం నిర్మాతగా కూడా మారాడని తెలుసా..?
ఇక రిలీజ్ డేట్ ప్రకటించడంతో మేకర్స్ ప్రమోషన్స్ షురూ చేశారు. అందులో భాగంగానే మిషన్ మ్యూజిక్ ను మొదలుపెట్టారు. ఈ సినిమాలోని మొదటి సాంగ్ ను రిలీజ్ చేయడానికి మేకర్స్ ముహూర్తం ఖరారు చేశారు. మళ్లీ మళ్లీ నువ్వే ఎదురొస్తే అంటూ సాగే సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఫుల్ సాంగ్ ను రేపు సాయంత్రం 7.03 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. ఇక ఈ సినిమాకు తమిళ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ హిప్ హాప్ తమిళ్ సంగీతం అందిస్తున్నాడు. సాంగ్ చాలా కొత్తగా అనిపిస్తోంది. ముఖ్యంగా అఖిల్ లుక్ అయితే అదిరిపోయింది. హీరోయిన్ సాక్షి వైద్య, అఖిల్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయ్యేలా కనిపిస్తోంది. మరి ఈ సినిమాతో అయ్యగారు ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.