OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన ఓజీ సినిమా మంచి హిట్ అందుకుంది. కల్ట్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోయేలా తీశాడు సుజీత్. పవన్ ను ఎలా చూడాలని ఇన్నేళ్లు ఫ్యాన్స్ వెయిట్ చేశారో.. అచ్చం అలాగే చూపించాడు. అయితే ఓజీ సినిమాకు పార్ట్-2 కూడా ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు. ఆ సినిమాలో అకీరా నందన్ నటిస్తారనే ప్రచారం అయితే జరుగుతోంది. కానీ దానిపై ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. ఈ టైమ్ లో మరో విషయం వైరల్ అవుతోంది. అదేంటంటే పవన్ కు చాలా కాలం తర్వాత హిట్ ఇచ్చినందుకు సుజీత్ పై పవన్ చాలా ఇంప్రెస్ గా ఉన్నారంట. అతనికి మరో సినిమా చేసే అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నారంట.
Read Also : OG : అకీరాతో ఓజీ 2..? బాక్సులు బద్దలయ్యే న్యూస్ చెప్పిన సుజీత్
ఒకవేళ ఓజీ-2లో పవన్ కల్యాణ్ నటించినా.. నటించకపోయినా.. ఇంకో సినిమా తీయాలని భావిస్తున్నారంట. కాకపోతే దానికి ఇంకా టైమ్ పడుతుంది. ఈ లోగా పవన్ తన చేతిలో ఉన్న సినిమాలను కంప్లీట్ చేయాలనే ఉద్దేశంలో ఉన్నట్టు తెలుస్తోంది. అటు సుజీత్ కూడా తన తర్వాత మూవీ నానితో చేయబోతున్నాడు. అది యూత్ ఫుల్ క్రేజీ సినిమాగా రాబోతోంది. ఓజీ-2 రావడానికి రెండేళ్ల కంటే ఎక్కువ సమయం పట్టేలా ఉంది. ఆ మూవీ ఉన్నా లేకపోయినా.. సుజీత్ నానితో తీసే మూవీ మంచి హిట్ కొడితే పవన్ కల్యాణ్ ఇంకో ఛాన్స్ ఇవ్వడం ఖాయం అంటున్నారు. మరి ఈ విషయంలో సుజీత్ తన ఛాన్స్ ను కాపాడుకుంటారా లేదా అనేది చూడాలి.
Read Also : OG : ఫ్యాన్స్ కు ఏళ్ల కల తీర్చేసిన సుజీత్..
