యంగ్ టైగర్ ఎన్టీఆర్ అప్పుడప్పుడు వెకేషన్స్‌కి వెళ్తుంటాడు. మహేష్ బాబు మాత్రం కనీసం నెలకోసారైనా ఫ్లైట్ ఎక్కాల్సిందే. అయితే… ఈ ఇద్దరు కూడా ఇప్పుడు ఫారిన్‌లో ఎంజాయ్ చేయడానికి రెడీ అయిపోయారు. ఇప్పటికే ఎన్టీఆర్ ఫారిన్ ఫ్లైట్ ఎక్కేశాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న దేవర షూటింగ్‌కు చిన్న బ్రేక్ ఇచ్చి.. న్యూ ఇయర్ వెకేషన్‌కు చెక్కేశాడు యంగ్ టైగర్. ఫ్యామిలీతో కలిసి ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న ఎన్టీఆర్ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం… ఈసారి వెకేషన్‌కు ఎన్టీఆర్ జపాన్ వెళ్లాడు. అక్కడ వారం పది రోజులు ఉండి… జనవరి సెకండ్ వీక్‌లో తిరిగి రానున్నట్టుగా తెలుస్తోంది. వచ్చాక దేవర సెట్స్‌లో జాయిన్ అవనున్నాడు. ఇక మహేష్ బాబు కూడా న్యూ ఇయర్ వెకేషన్‌కు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేసిన గుంటూరు కారం కొత్త పోస్టర్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.
గుంటూరు కారం నుంచి రివీల్ అయిన ప్రతి లుక్‌లో బీడీతో కనిపించిన మహేష్… ఇంతకు ముందులా మాస్ లుక్‌లో కాకుండా… ఈసారి చాలా సింపుల్‌గా క్లాస్‌గా, కూల్‌గా కనిస్తున్నాడు. ఈ నయా పోస్టర్ లేడీ ఫ్యాన్స్‌ను అట్రాక్ట్ చేసేలా ఉంది. ఇక సంక్రాంతికి రిలీజ్ కానున్న గుంటూరు కారం షూటింగ్‌ను ఈ వారంతో ప్యాకప్ చెప్పబోతున్నాడు మహేష్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో వేసిన సెట్‌లో జరుగుతోంది. ఈ సాంగ్ పూర్తయితే సినిమా దాదాపు పూర్తి అయినట్లే. ఈనెల 28 నాటికి టోటల్ షూటింగ్ పూర్తి చేసి… ఫారిన్ వెకేషన్‌కు వెళ్లనున్నాడు సూపర్ స్టార్. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అక్కడే చేసుకొని… తిరిగి రాగానే ‘గుంటూరు కారం’ ప్రమోషన్స్‌తో బిజీ కానున్నాడు. జనవరి 6న గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. మరి… ఎన్టీఆర్, మహేష్… తిరిగి హైదరాబాద్‌లో ఎప్పుడు ల్యాండ్ అవుతారో చూడాలి.