NTV Telugu Site icon

Ameesha Patel: పవన్ హీరోయిన్.. ఎన్నాళ్లకు ఓ హిట్ కొట్టింది

Ameesha

Ameesha

Ameesha Patel: బద్రి సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్. పవన్ కళ్యాణ్ సరసన పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అమీషాకు మంచి పేరును తెచ్చిపెట్టింది. ఈ సినిమా తరువాత ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్ లిస్ట్ లో ఉంటుంది అనుకున్నారు. అలాగే స్టార్ హీరోల సరసన అవకాశాలు వచ్చాయి.. కానీ, ఆశించిన విజయాలు మాత్రం రాలేదు. దీంతో ఈ చిన్నది తెలుగుకు స్వస్తి చెప్పి బాలీవడ్ లోనే సెటిల్ అయిపోయింది. ఇక సినిమాల కన్నా వివాదాలతోనే ఎక్కువ ఫేమస్ అయిన అమీషా పటేల్.. ఈ మధ్యనే గద్దర్ 2 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. . 2001లో లవ్ అండ్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన గద్దర్ సినిమాకు సీక్వెల్ గా గద్దర్ 2 ను తెరకెక్కించారు. అనిల్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సన్నీ డియోల్ సరసన అమీషా పటేల్ నటించి మెప్పించింది. ఈ శుక్రవారం రిలీజ్ అయిన ఈ చిత్రం రెండు రోజుల్లనే రూ. 40 కోట్లు రాబట్టి సెన్సేషన్ ను క్రియేట్ చేస్తోంది.

Ankita Lokhande: తండ్రి పాడె మోసిన నటి.. వీడియో వైరల్

చాలా ఏళ్ళ తరువాత అమీషా ఇంత పెద్ద హిట్ ను అందుకుందని చెప్పాలి. సకీనా అనే పాత్రలో అమీషా నటించింది అనడం కన్నా జీవించింది అని చెప్పాలి. వివాదాలు, కోర్టులు, కేసులు మధ్య నలిగిపోతున్న అమీషాకు ఈ సినిమా హిట్ కొద్దిగా ఊరట అందించింది అని చెప్పొచ్చు. ఇక మరో వారం రోజులు ఈ సినిమా కలక్షన్స్ ఇలాగే ఉంటే.. అమీషా వంద కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమని చెప్పాలి. ప్రస్తుతం ఆమె వయస్సు 47. ఇంకా కుర్ర హీరోయిన్లకు పోటీగా అందాల ఆరబోత చేస్తూ మెప్పిస్తుంది. ఈ సినిమా హిట్ కాడంతో ముందు ముందు అమ్మడికి మంచి అవకాశాలే దక్కేట్టూ ఉన్నాయి. మరి ఈసారైనా ఈ బహ్మ తన విజయ పరంపరను కొనసాగిస్తుందో లేదో చూడాలి.

Show comments