NTV Telugu Site icon

21 ఏళ్ళ తర్వాత మహేశ్ తో టబు

After 21 years Tabu in talks to reunite with Mahesh Manjrekar on White

పాత్రల ఎంపికలో ఎంతో జాగ్రత్త పడుతూ ఉంటుంది నటి టబు. అంత సెలక్టీవ్ గా ఉంటుంది కాబట్టే తక్కువ సినిమాలు చేస్తూ ఉంటుంది. తాజాగా మహేశ్ మంజ్రేకర్ దర్శకత్వంలో సినిమా చేయటానికి ఒప్పుకుంది టబు. గతంలో మహేశ్ దర్శకత్వం వహించిన ‘అస్థిత్వ’లో లీడ్ రోల్ చేసింది టబు. 2000 సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా జాతీయ అవార్డును సాధించింది. దాదాపు 21 సంవత్సరాల తర్వాత మళ్ళీ మహేశ్, టబు కలసి సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో టబు విధవరాలుగా కనిపించనుంది. ఈ పాత్ర బోల్డ్ గా ఉండి సినిమాకి సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా ఉంటుందట. ప్రస్తుతం ఓ మరాఠీ సినిమా ఆధారంగా సల్మాన్ ఖాన్, ఆయుష్మాన్ శర్మ తో ‘అంతిమ్’ పేరుతో సినిమా తీస్తున్నారు మహేశ్. ఆ తర్వాత టబు సినిమాను పట్టాలెక్కిస్తారట.

Read Also : “లైగర్”కు బాలయ్య సర్ప్రైజ్