Site icon NTV Telugu

Allu Arha: ఆమె చేతిలో ఓడిపోయిన అల్లు అర్జున్.. వీడియో వైరల్

Bunny

Bunny

Allu Arha: అల్లువారి వారసురాలు అల్లు అర్హ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ గారాల పట్టిగా ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ మాములుగా లేదు. చిన్నతనం నుంచే అర్హను ఒక సెలబ్రిటీగా మార్చేసింది బన్నీ భార్య స్నేహ. తండ్రి కూతుళ్లు చేసే అల్లరి పనులను నిత్యం సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు కూతురును దగ్గర చేస్తోంది. ఇటుపక్క బన్నీ కూడా కొద్దిగా సమయం చిక్కినా కూతురుతో ఆడుకుంటూ చిన్నపిల్లాడిగా మారిపోతాడు. ఇప్పటికే ఈ తండ్రి కూతుళ్ళ క్యూట్ వీడియోస్ చాలా వైరల్ గా మారాయి. తాజాగా మరో వీడియోను అభిమానులతో పంచుకున్నాడు బన్నీ. ఈ వీడియోలో అర్హ.. బన్నీకే ఛాలెంజ్ విసురుతోంది.

గంగిగోవు పాలు గరిటడైనా చాలు అని అర్హ ముద్దు ముద్దగా అడుగగా.. అది పొదుపు కదా.. అయితే దానికి సమాధానం జున్ను అని చెప్పుకొచ్చాడు బన్నీ.. అందుకు అర్హ.. నీకెలా తెలుసు అంటూ నోరెళ్ళ బెట్టింది. ఇక ఆ తరువాత ఏడు నల్ల లారీలు.. ఏడు తెల్ల లారీలు అని ఫాస్ట్ గా అనమంటూ తండ్రికి సవాల్ విసిరింది. ఇక దీనికి సమాధానం చెప్తూ బన్నీ తడబడడంతో అర్హ గెలిచింది.. కూతురు చేతిలో బన్నీ ఓడిపోయాడు. ప్రస్తుతం ఈ క్యూట్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ప్రస్తుతం బన్నీ, పుష్ప 2 పనుల్లో బిజీగా ఉన్నాడు. అర్హ సైతం బాలనటిగా అడుగుపెట్టబోతోంది. సమంత- గుణశేఖర్ కాంబోలో వస్తున్న శాకుంతలం చిత్రంలో అర్హ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. త్వరలోనే ఈ అల్లువారి వారసురాలు తండ్రికి తగ్గ తనయ అని అనిపించుకోవడం పక్కా అనిపిస్తుంది.

Exit mobile version