NTV Telugu Site icon

Adivi Sesh: ఇండియాని షేక్ చేసే అనౌన్స్మెంట్… జాన్ 9న

G2

G2

అడివి శేష్ తనకంటూ స్పెషల్ జానర్ ని క్రియేట్ చేసుకోని ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ సినిమాలతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నాడు. ‘క్షణం’ సినిమాతో ఈ కుర్రాడు ఎవరో కొత్తగా చేసాడే అనిపించుకున్న అడివి శేష్, ‘గూఢచారి’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. 6 కోట్ల బడ్జట్ లో స్పై థ్రిల్లర్ సినిమాని రిచ్ గా చెయ్యోచు అని నిరూపించిన అడివి శేష్, ‘త్రినేత్ర’ అనే ఒక కొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకి పరిచయం చేశాడు. ఈ ‘త్రినేత్ర’ ఏజెన్సీలో గూఢచారి అయిన అడివి శేష్, పార్ట్ 2ని ఎప్పుడు స్టార్ట్ చేస్తాడా అని సినీ అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేశారు. పాన్ ఇండియా స్కోప్ ఉన్న గూఢచారి 2 సినిమాని పాన్ ఇండియా హీరో అయ్యాకే స్టార్ట్ చెయ్యాలి అనుకున్నాడో లేక కథ సిద్ధం అవ్వలేదో తెలియదు కానీ అడివి శేష్ ఎప్పటికప్పుడు గూఢచారి 2 సినిమాని వాయిదా వేస్తూనే వచ్చాడు.

మేజర్ సినిమాతో తన మార్కెట్ ని టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా రేంజ్ కి తీసుకోని వెళ్లిన అడివి శేష్, తన బ్రెయిన్ చైల్డ్ అయిన ‘గూఢచారి 2’ని ఇదే సరైన సమయం అని నమ్మినట్లు ఉన్నాడు. అయిదేళ్లుగా పక్కన పెడుతూ వచ్చిన గూఢచారి 2 సినిమాని స్టార్ట్ చేశాడు. ఈ మూవీ నుంచి 2023 జనవరి 9న పాన్ ఇండియా రేంజులో అనౌన్స్మెంట్ వీడియో బయటకి రానుంది. ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తూ ప్రొడ్యూసర్స్ అయిన ‘ఏకే ఎంటర్టైన్మెంట్స్’, ‘పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ’, ‘అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్’ ట్వీట్ చేశాయి. ఢిల్లీ, ముంబై నగరాల్లో ‘గూఢచారి 2’ సినిమాకి సంబంధించిన ఒక ‘ప్రీ-విజన్’ వీడియోని కూడా జనవరి 9నే రిలీజ్ చెయ్యనున్నారు. ఈ పాన్ ఇండియా సినిమాని ‘వినయ్ కుమార్ సిరిగినీడి’ డైరెక్ట్ చేస్తున్నాడు. గూఢచారి సినిమాని తెరకెక్కించిన ‘శశీ కిరణ్ తిక్కా’నే పార్ట్ 2ని కూడా డైరెక్ట్ చేస్తాడని అంతా అనుకున్నారు కానీ ‘గూఢచారి’ సినిమాకి అసోసియేట్ ఎడిటర్, ‘మేజర్’ సినిమాకి ఎడిటర్ అయిన ‘వినయ్ కుమార్ సిరిగినీడి’ చేతికి గూఢచారి2 దర్శకత్వ బాధ్యతలు అప్పగించాడు అడివి శేష్. దాదపు మొదటి సినిమా నుంచి కలిసే ట్రావెల్ అవుతున్నారు కాబట్టి అడివి శేష్ మరియు వినయ్ కుమార్ సిరిగినీడి ‘గూఢచారి2’ సినిమాని గ్రాండ్ స్కేల్ లోనే ఉండేలా రూపొందిస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఇంతకీ జనవరి 9న శేష్ ఇవ్వబోయే అప్డేట్ ఏంటి అనేది చూడాలి.