Site icon NTV Telugu

కోలుకున్న అడివి శేష్… డబుల్ ఎనర్జీతో బ్యాక్

adivi-sesh

యంగ్ హీరో అడవి శేష్ డెంగ్యూ నుంచి పూర్తిగా కోలుకున్నాడు. సెప్టెంబర్ నెలలో అడివి శేష్ ను డెంగ్యూ కారణంగా హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆయన రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్య బాగా పడిపోయింది. దీంతో సెప్టెంబర్ 18 న అడివి శేష్ ను ఆసుపత్రికి తరలించారు. కోలుకున్న తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన ఆయన కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్నారు. తాజాగా డబుల్ ఎనర్జీతో జిమ్ లో వర్కౌట్లు చేస్తున్న అడవి శేష్ అభిమానుల కోసం ఓ చిన్న వీడియోను షేర్ చేసుకున్నారు.

Read also : కెమెరాకు కలిసి ఫోజిచ్చిన భీమ్లా నాయక్, డేనియల్ శేఖర్… పిక్ వైరల్

ప్రస్తుతం అడివి శేష్ ‘మేజర్’ చిత్రం షూటింగ్ ను పూర్తి చేయాల్సి ఉంది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో మేజర్ పాత్రలో కనిపించబోతున్నాడు ఈ యంగ్ హీరో. 26/11 దాడుల్లో అమరవీరుడైన మేజర్ ఉన్నికృష్ణన్ గా నటిస్తున్న అడివి శేష్ లుక్ కు ఇప్పటికే మంచి స్పందన వచ్చింది. కరోనా వైరస్, లాక్డౌన్ కారణంగా షూటింగ్ కొన్ని రోజులు ఆగిపోయింది. త్వరలో అడివి శేష్ మేజర్ సెట్స్‌లో చేరనున్నాడు. దీనిని సోనీ పిక్చర్స్, మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్, ఏ+ఎస్ మూవీస్ నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ యాక్షన్ డ్రామా తెలుగు, హిందీ, మలయాళంలో విడుదల కానుంది. బాలీవుడ్ నటి సాయి మాంజ్రేకర్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.

Exit mobile version