Major: పవన్ వారసుడితో అడివి శేష్ మల్టీస్టారర్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్హీరో అడివి శేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విలన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో ఆ తరువాత విభిన్నమైన కథలను ఎంచుకొని ఆనతికాలంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన మేజర్ చిత్తరంలో హీరో గా నటిస్తున్నాడు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముంబై తాజ్ హోటల్ మారణహోమంలో ప్రాణాలను వదిలిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథగా ఈ సినిమాను తెరకెకెక్కించాడు దర్శకుడు శశికిరణ్ తిక్కా. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా జూన్ 3 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ వేగాన్ని పెంచేసిన చిత్రబృందం వరుస ఇంటర్వ్యూలతో బిజీగా మారిపోయింది. ఇక తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో అడివి శేష్, పవన్ కళ్యాణ్ వారసుడు అకీరాతో తనకున్న అనుభందం గురించి చెప్పుకొచ్చాడు.
పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా తో మీరేమైనా మల్టీస్టారర్ చేసే అవకాశముందా..? అన్న యాంకర్ ప్రశ్నకు శేష్ మాట్లాడుతూ ” లేదండీ.. మేము ఇద్దరం మంచి ఫ్రెండ్స్.. వారం.. వారం కలుస్తూ ఉంటాం. అకీరా ఇండస్ట్రీకి వస్తాడో లేదో చెప్పలేను.. తనకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం.. తాను పియానో పై వాయించిన రికార్డ్స్ ను వింటాను.. చాలా బాగా వాయిస్తాడు.. అప్పుడప్పుడు తాను కొత్తగా రికార్డ్ చేసిన ట్యూన్స్ ను నాకు పంపిస్తాడు.. వాటిని వింటూ నిద్రపోతాను. ఇక పవన్ కళ్యాణ్ గారంటే పిచ్చి అని చెప్పను కానీ అదొక గౌరవం.. మనసులో నుంచి వచ్చే మర్యాదపూర్వకమైన గౌరవం.. నేను ఆయనతో మాట్లాడింది కూడా ఒక నాలుగైదు సార్లు.. ఎప్పుడైనా బర్త్ డే విషెస్.. అలాంటివి.. అయితే అకీరాతో నేనెప్పుడూ క్లోజ్ గా ఉంటాను” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
Also Read
- M.S Raju : ఎన్టీఆర్ చికెన్ కామెంట్స్ పై ఎం.ఎస్ రాజు వివరణ.. నాకు ఎంతో స్పూర్తి!
- M.S Raju : ‘అగధ’ కంటెంట్ చూసి ‘ఈ సారి కొడుతున్నారు సార్’ అని మహేష్, ‘కొడుతున్నావ్ బావ’ అని ప్రభాస్ అన్నారు!
- Censor: సినిమా రీ-ఎడిటింగ్‌కు సెన్సార్ బోర్డు చెక్: నిబంధనల్లో కీలక మార్పులు?
- Tollywood: సీక్వెల్ కావాలంటున్న స్టార్ హీరో.. ‘నో’ అంటున్న డైరెక్టర్!
తాజావార్తలు
-
Pocharam Srinivas Reddy: పోచారం సంచలన వ్యాఖ్యలు.. రేవంత్‌పై ఫైర్, బాన్సువాడలో మళ్లీ మనమే
-
Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
-
Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్‌ను ‘‘బాగ్దాద్ ఒప్పందం’’ కాపాడలేదు.. ఇప్పుడు ‘‘ఇస్లామిక్ నాటో’’ పరిస్థితి కూడా అంతేనా?
-
KBR Park : కేబీఆర్ పార్క్ చుట్టూ ఇక వన్‌వే ట్రాఫిక్.. కొత్త నిబంధనలు అమల్లోకి.!
-
Liquor Policy: మద్యం పాలసీపై ప్రభుత్వం కసరత్తు.. సెప్టెంబర్ 30 చివరి తేదీ..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..