NTV Telugu Site icon

Adivi Sesh: ఆమెతో అడివి శేష్ ఎఫైర్.. మరోసారి బట్టబయలు..?

Sesh

Sesh

Adivi Sesh: టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ వరుస సినిమాలతోనే కాదు వరుస హిట్లతో కూడా బిజీగా మారిపోయాడు. ఇటీవలే హిట్ 2 తో హిట్ అందుకున్న శేష్ ప్రస్తుతం గూఢచారి 2 సినిమామీద ఫోకస్ పెడుతున్నాడు. ఇక టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో శేష్ ఒకడు. ఎప్పుడు పెళ్లి గురించి అడిగినా ప్రభాస్ తరువాత అని చెప్పి తప్పించుకుంటూనే ఉంటాడు. అయితే ఎప్పటినుంచో శేష్ అక్కినేని అమ్మాయితో ప్రేమలో ఉన్నాడంటూ వార్తలు గుప్పుమంటున్న విషయం తెల్సిందే. ఆమె ఎవరో కాదు సుప్రియ యార్లగడ్డ.. అదేనండీ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అంటూ పవన్ సరసన నటించి మెప్పించిన సుప్రియ. గూఢచారి సినిమాతో సుప్రియ రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ సమయంలో శేష్, సుప్రియలు రిలేషన్ లో ఉన్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఆ సమయంలో శేష్ స్పందిస్తూ సుప్రియ తనకు మంచి ఫ్రెండ్ అని ఇలాంటి గాసిప్స్ పుట్టించకండని కొద్దిగా ఘాటుగానే స్పదించాడు.

ఇక అప్పటితో ఆ రూమర్ ముగిసిపోయింది. తాజాగా శేష్ షేర్ చేసిన ఫోటోతో మరోసారి ఆ రూమర్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారాయి. అక్కినేని క్రిస్టమస్ సెలబ్రేషన్స్ లో శేష్ భాగమయ్యాడు. ఎరుపు దుస్తులు ధరించి క్రిస్టమస్ ట్రీ వద్ద సుప్రియ పక్కన నిలబడి శేష్ ఫోజిలిచ్చాడు. దీంతో మరోసారి ఈ వార్త బయటకి వచ్చింది. ఈ ఫొటోలో అక్కినేని కజిన్స్ అందరు ఉన్నారు. సుమంత్, సుశాంత్, అఖిల్ తో పాటు సుప్రియ మరికొందరు కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇక శేష్ కు అక్కినేని, ఘట్టమనేని, మెగా ఫ్యామిలీలతో మంచి అనుబంధం ఉంది. దీంతో వారందరు అప్పుడప్పుడు కలుస్తారు. అందులో తప్పేమి లేదు.. ఇవన్నీ వట్టి పుకార్లు మాత్రమే అని మరికొందరు చెప్పుకొస్తున్నారు. అసలు ఈ రూమర్స్ కు చెక్ పడాలంటే శేష్ పెళ్లి వార్త వినబడాల్సిందే. మరి ఈ ‘గూఢచారి’.. ‘ఎవరు’ ని తీసుకొచ్చి తన భాగస్వామిగా పరిచయం చేస్తాడో చూడాలి.

Show comments