NTV Telugu Site icon

Adivi Sesh: ‘హిట్ 2’ థియేటర్లను హిట్ చేసేది ఎప్పుడంటే..?

Adivi Sesh

Adivi Sesh

Adivi Sesh: హీరో నాని వాల్‌పోస్టర్‌ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిర్‌నేనితో కలిసి తొలి చిత్రంగా ‘అ!’ను నిర్మించాడు. అది చక్కని పేరు తెచ్చిపెట్టడంతో పాటు జాతీయ అవార్డులనూ సొంతం చేసుకుంది. ఇక రెండో చిత్రంగా ‘హిట్‌’ అనే సీట్‌ థ్రిల్లర్‌ను రూపొందించి సూపర్‌ డూపర్ హిట్‌ అందుకున్నాడు. ఈ సినిమాకు ఫ్రాంచైజీగా ‘హిట్ ‌2’ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. అయితే మొదటి భాగంలో హీరోగా నటించిన విశ్వక్ సేన్ కాకుండా ఈ ఫ్రాంచైజ్ మూవీలో అడివి శేష్ నటిస్తున్నాడు. ‘ది సెకండ్‌ కేస్‌’ అనే ట్యాగ్ లైన్ తో ఈ మూవీ షూటింగ్ కూడా మొదలైంది. దర్శకుడు శైలేష్‌ కొలను ‘హిట్ 2’నూ సూపర్ హిట్ చేయాలనే తపనతో స్క్రిప్ట్ ను తయారు చేశారు.

మొదటి భాగాన్ని తెలంగాణ రాష్ట్రానికి చెందిన పోలీస్‌ ఆఫీసర్‌ కూతురు మిస్సింగ్‌ కేసుని ఎలా డీల్‌ చేశాడనే కాన్సెప్ట్‌తో తీయగా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ కు చెందిన హిట్‌ టీమ్‌ ఆఫీసర్‌ కృష్ణ దేవ్‌ అలియాస్‌ కె.డి. ఈ ఎగ్జయిటింగ్‌ జర్నీని కంటిన్యూ చేయబోతున్నారు. మణికందన్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి జాన్‌ స్టీవర్ట్‌ ఎడురి సంగీతాన్ని అందించనున్నారు. అడివి శేష్ తో పాటు మీనాక్షి చౌదరి, రావు రమేష్‌, భాను చందర్‌, పోసాని కృష్ణమురళి, తనికెళ్ల భరణి, శ్రీకాంత్‌ మాగంటి, కోమలి ప్రసాద్‌ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించబోతున్నారు. ఈ మూవీని డిసెంబర్ 2న విడుదల చేయబోతున్నట్టు ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా తెలియచేశారు. ‘మేజర్’తో చక్కని విజయాన్ని అందుకున్న అడివి శేష్ కు ‘హిట్ 2’ ఏ స్థాయి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

Show comments