HIT 2 Trailer Update: హీరోగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటున్న టైంలో నాని ప్రొడ్యూసర్ గా మారి చేసిన సినిమా ‘అ!’. మొదటి మూవీ పేరు తెచ్చింది కానీ డబ్బులు మాత్రం అంతంతమాత్రంగానే తెచ్చింది. దీంతో సెకండ్ ప్రొడక్షన్ లో కొత్త దర్శకుడు శైలేష్ కొలనుతో కలిసి ‘హిట్’ సినిమా చేశాడు. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ మూవీ నానికి మంచి కలెక్షన్స్ ని తెచ్చి పెట్టింది. ఫ్రాంచైజ్ గా మారిన హిట్ సీరీస్ నుంచి వస్తున్న లేటెస్ట్ మూవీ ‘హిట్ సెకండ్ కేస్’. అడవి శేష్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ టీజర్ ఇప్పటికే రిలీజ్ అయ్యి మంచి ఫీడ్ బ్యాక్ ని సొంతం చేసుకుంది. థ్రిల్లర్ జానర్ లో రూపొందిన ఈ మూవీని డిసెంబర్ 2న విడుదల చేస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో నాని, శేష్ కలిసి ‘హిట్ 2’ ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేశారు.
Read Also: Aha: గుణపాఠాలు చెప్పే ‘ఇంటింటి రామాయణం’!
హిట్ 2 ట్రైలర్ ని నవంబర్ 23న రిలీజ్ చేస్తున్నామని అనౌన్స్ చేస్తూ శేష్ అండ్ నాని ఒక వీడియోని బయటకి వదిలారు. ఇందులో నాని ‘దసరా’ సినిమా లుక్ లో ఉన్నాడు. శేష్, నానికి మధ్య హిట్ 2 బిజినెస్ గురించి కొంత కన్వర్జేషన్ జరిగిన తర్వాత, శేష్ ‘సినిమా హిట్ అవుతుందా లేదా అనే విషయాన్నీ ఈ మధ్య ఆడియన్స్ ట్రైలర్ చూసే చెప్పేస్తున్నారు’ అనగానే నాని ట్రైలర్ చూసే చెప్తున్నాను అంటూ సమాధానం చెప్పాడు. దీంతో మీరు చూస్తే సరిపోదు, వాళ్లకి కూడా చూపించాలి కదా అని శేష్ అడగడంతో నాని హిట్ 2 ట్రైలర్ నవంబర్ 23న రిలీజ్ చేస్తున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. టీజర్ తో మెప్పించిన హిట్ 2 మేకర్స్ ట్రైలర్ ని ఇంకా థ్రిల్లింగ్ గా కట్ చేసి, ఆడియన్స్ ని థియేటర్ వైపు రప్పించడంలో సక్సస్ అవుతారేమో చూడాలి.
