Site icon NTV Telugu

Adivi Sesh: యూట్యూబ్ లో ‘హిట్ 2’ టీజర్‌ తొలగింపుపై అడవిశేష్ స్పందన

Hit

Hit

Adivi Sesh: భిన్నమైన సినిమాలు చేస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు అడివి శేష్ తాజా చిత్రం ‘హిట్ 2’. ఇది డిసెంబర్ 2న సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. శైలేష్ కొల‌ను ద‌ర్శక‌త్వంలో నాని స‌మ‌ర్పకుడిగా వాల్ పోస్టర్ సినిమా బ్యాన‌ర్‌పై ప్రశాంతి త్రిపురనేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌద‌రి హీరోయిన్‌. రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అతి త‌క్కువ వ్యవ‌ధిలో యూ ట్యూబ్ లో ఈ టీజ‌ర్ హ‌ల్ చ‌ల్ చేస్తూ ట్రెండ్ అయ్యింది. అయితే యూట్యూబ్ ‘హిట్ 2’ టీజ‌ర్‌ను ట్రెండింగ్ లిస్టు నుంచి తొల‌గించింది.

టీజ‌ర్ చూడ‌టానికి వ‌యోప‌రిమితి అవసరమని స్పష్టం చేసింది. అప్పటికే 9 మిలియ‌న్ వ్యూస్ వ‌చ్చాయని యూనిట్ చెబుతోంది. ఈ తొలగింపుపై హీరో అడివి శేష్ స్పందిస్తూ ఓ వీడియో విడుద‌ల చేశారు. టీజ‌ర్‌ చూడాల‌నుకుంటే ఏం చేయాలో కూడా చెప్పారు. నిజానికి ఇలాంటిది జ‌రుగుతుంద‌ని తమ టీమ్ ఊహించిందని, అయితే అంతా స‌వ్యంగా జ‌రుగుతుంద‌ని భావిస్తున్నానన్నారు. ఇక గురువారం విడుదల కాబోయే ‘ఉరికే ఉరికే..’ పాటను చూసి అందరూ ఎంజాయ్ చేస్తారంటున్నాడు.

Exit mobile version