Site icon NTV Telugu

Adivi Sesh: నేను కాలితో తంతే అనుష్క మెడకి గాయమైంది!!

Adivi Sesh

Adivi Sesh

హీరో అడివి శేషు తన ‘డెకాయిట్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. మరో వారం రోజుల్లో ఈ సినిమా విడుదల కానున్న తరుణంలో, సినిమాను పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నాడు. తన చిన్ననాటి స్నేహితుడు శానిల్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని తెలుగు సహా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. తాజాగా సుమకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనుష్కతో తన అనుభవాన్ని అడివి శేషు పంచుకున్నాడు. నిజానికి అనుష్క హీరోయిన్‌గా నటించిన ‘బాహుబలి’ సినిమాలో విలన్ కుమారుడి పాత్రలో అడివి శేషు కనిపించాడు.

Also Read:Aditya Dhar: దురంధర్ కాపీ ఆరోపణలు.. ఆదిత్యధర్ సంచలన నిర్ణయం

భల్లాళదేవుడైన రానా కుమారుడిగా ఆయన నటించాడు. ఒక సీన్‌లో అనుష్కను తన్నాల్సిందిగా రాజమౌళి చెప్పారని, సీన్ కోసం కావాల్సిన ఇంటెన్సిటీ రావట్లేదని, ఫోర్స్‌ఫుల్‌గా తన్నమని చెప్పడంతో తాను నిజంగానే తన్నానని చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో అనుష్క మెడ భాగం బెణికినట్లు అనిపించిందని అన్నాడు. అంత బలంగా తన్నినా ఆమె ఏమాత్రం బాధపడలేదని, సీన్ బాగా వచ్చిందా లేదా అని మాత్రమే ఆలోచించిందని తెలిపాడు. అందుకే అనుష్క పేరుకు తగ్గట్టే చాలా ‘స్వీటీ’ అని అడివి శేషు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. గాయపడినా కూడా సినిమా కోసం ఆలోచించడం గొప్ప విషయం అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version