Adivi Sesh: నేను కాలితో తంతే అనుష్క మెడకి గాయమైంది!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హీరో అడివి శేషు తన ‘డెకాయిట్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. మరో వారం రోజుల్లో ఈ సినిమా విడుదల కానున్న తరుణంలో, సినిమాను పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నాడు. తన చిన్ననాటి స్నేహితుడు శానిల్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని తెలుగు సహా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. తాజాగా సుమకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనుష్కతో తన అనుభవాన్ని అడివి శేషు పంచుకున్నాడు. నిజానికి అనుష్క హీరోయిన్‌గా నటించిన ‘బాహుబలి’ సినిమాలో విలన్ కుమారుడి పాత్రలో అడివి శేషు కనిపించాడు.
Also Read:Aditya Dhar: దురంధర్ కాపీ ఆరోపణలు.. ఆదిత్యధర్ సంచలన నిర్ణయం
Also Read
- Nani: నా కెరీర్లోనే అత్యంత కష్టమైన సినిమా ఇదే.. జడల బరువుపై నాని సంచలన వ్యాఖ్యలు!
- Nani: మా డైరెక్టర్ ఎవరినీ కొట్టలేదు.. నాని కీలక వ్యాఖ్యలు
- The Paradise: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి నాని ‘ది ప్యారడైజ్’!
- Hanuman Ansh: త్రివిక్రమ్ చేతుల మీదుగా తెలుగులోకి 'హనుమాన్ అంశ్' - సెప్టెంబర్ 18న గ్రాండ్ రిలీజ్!
భల్లాళదేవుడైన రానా కుమారుడిగా ఆయన నటించాడు. ఒక సీన్‌లో అనుష్కను తన్నాల్సిందిగా రాజమౌళి చెప్పారని, సీన్ కోసం కావాల్సిన ఇంటెన్సిటీ రావట్లేదని, ఫోర్స్‌ఫుల్‌గా తన్నమని చెప్పడంతో తాను నిజంగానే తన్నానని చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో అనుష్క మెడ భాగం బెణికినట్లు అనిపించిందని అన్నాడు. అంత బలంగా తన్నినా ఆమె ఏమాత్రం బాధపడలేదని, సీన్ బాగా వచ్చిందా లేదా అని మాత్రమే ఆలోచించిందని తెలిపాడు. అందుకే అనుష్క పేరుకు తగ్గట్టే చాలా ‘స్వీటీ’ అని అడివి శేషు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. గాయపడినా కూడా సినిమా కోసం ఆలోచించడం గొప్ప విషయం అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?