Site icon NTV Telugu

Aditya T20 Love Story: వర్మ ఆవిష్కరించిన ఫస్ట్ లుక్ పోస్టర్!

Aditya T 20

Aditya T 20

Aditya T20 Love Story First Look Poster Release:

శ్రీఆదిత్య హీరోగా, రమ్య, పవిత్ర, మాధురి హీరోయిన్లుగా చిన్నబాబు అడపా నిర్మిస్తున్న చిత్రం ‘ఆదిత్య టి-20 లవ్ స్టోరీ’. లవ్ అండ్ యాక్షన్ జానర్‌లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి చిన్ని చరణ్ అడపా దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌‌ను రామ్ గోపాల్ వర్మ విడుదల చేశారు. ‘ఆదిత్య టి-20 లవ్ స్టోరీ’ ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా కొత్తగా ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయని, త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నట్లు మేకర్లు తెలిపారు.

ప్రభు తాళ్లూరి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి కెమెరామెన్‌గా చిన్నబాబు అడపా, మ్యూజిక్ డైరెక్టర్‌గా చిన్ని చరణ్ అడపా, ఎడిటర్‌గా ఎంఆర్ వర్మ వ్యవహరిస్తున్నారు. ఈ మూవీకి పాటలను వేల్పుల వెంకేటేష్ రాయగా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ను అభిషేక్ రూఫస్ సమకూరుస్తున్నారు. వియఫ్ఎక్స్, గ్రాఫిక్స్ ను అఖిల్ (ఎ.ఎస్.డి.) అందిస్తున్నారు. విజయ రంగరాజు, దత్తు, రాజనాల, అప్పారావు, మేరీ భావన తదితరులు ఇందులో ఇతర ప్రధాన పాత్రలను పోషించారు.

Exit mobile version