Environmental Thriller Bandi Trailer Unveiled: సింగిల్ కారెక్టర్‌తో సినిమాను నడిపించడం అంటే మామూలు విషయం కాదు, ఇప్పటిదాకా ఇలాంటి చాలా తక్కువ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఇలాంటి ప్రయోగమే ఒకప్పటి కుర్రకారులో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న ఆదిత్య ఓం చేయబోతున్నారు. ఎప్పుడూ డిఫరెంట్ కాన్సెప్ట్, కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఆదిత్య ఓం ఈ సారి బందీ అనే సినిమాతో అందరినీ ఆకట్టుకునేందుకు రాబోతున్నారు. గల్లీ సినిమా బ్యానర్ మీద ఈ మూవీని వెంకటేశ్వర రావు దగ్గు, తిరుమల రఘు నిర్మిస్తుండగా.. తిరుమల రఘు దర్శకత్వం కూడా చేస్తున్నారు. ఇక త్వరలో రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో తాజాగా బందీ సినిమాకి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు.
Salaar vs Dunki: ఇక కదా కిక్కంటే.. డుంకీ డే 1 మొత్తాన్ని ఓవర్సీస్ లో కొట్టేశాడు ప్రభాస్!
ఇక ఈ ట్రైలర్ లో సినిమా కాన్సెప్ట్ గురించి చెప్పాడు. ఓ సగటు మనిషి కోరుకునేవి ఎలా ఉంటాయో చూపిస్తూ ఏ మనిషైనా ఆహారం, నీరు, డబ్బు, స్వాతంత్ర్యం కోరుకుంటారని, స్వేచ్చగా విహరించాలని అనుకుంటాడని చెబుతూనే అలాంటి వ్యక్తి జీవితంలో ఏర్పడిన ఘట్టాలనే బందీ అనే సినిమాగా రూపొందించారు. ఇక ఈ ట్రైలర్‌లో అన్ని రకాల ఎమోషన్స్‌ను ఆదిత్య ఓం చూపించగా చివరకు నగ్నంగా కనిపించి షాక్ ఇచ్చాడు. ఇక ఈ సినిమాకి వీరల్, లవన్, సుదేష్ సావంత్ సంగీతాన్ని అందించగా మధుసూధన్ కోట సినిమాటోగ్రఫర్‌గా వ్యవహరించారు. దేశంలోని పలు అటవీ ప్రాంతాల్లో ఈ మూవీని షూట్ చేశారని ఆదిత్య ఓం ఎలాంటి డూప్ లేకుండా అన్ని రకాల స్టంట్స్ చేశారని వెల్లడించారు. మూడేళ్లు కష్టపడి ఏడాదిలో ఉండే అన్ని రుతువుల్ని కవర్ చేస్తూ ఈ మూవీని షూట్ చేశారని పర్యావరణ సంరక్షణ మీద తీసిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుందని చెబుతున్నారు.