NTV Telugu Site icon

Aditya Narayan: ప్రముఖ సింగర్ ఉదిత్ నారాయణ్ కొడుకు దురుసు ప్రవర్తన.. అభిమానిని కొట్టి..

Adi

Adi

Aditya Narayan: ప్రముఖ సింగర్ ఉదిత్ నారాయణ్ కొడుకు ఆదిత్య నారాయణ్ ప్రస్తుతం సింగర్ గా కొనసాగుతున్నాడు. బాలీవుడ్ లో మంచి సింగర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆదిత్య చిక్కుల్లో పడ్డాడు. ఒక అభిమానితో అతడు దురుసుగా వ్యవహరించిన తీరు నెటిజన్లకు ఆగ్రహానికి గురిచేస్తోంది. తాజాగా ఛత్తీస్‌గడ్‌లో ఆయన నిర్వహించిన గాన కచేరీ వచ్చిన ఓ అభిమానితో ఆదిత్య దురుసుగా ప్రవర్తించాడు. తన అభిమాన సింగర్ సాంగ్ పాడుతున్నప్పుడు ఏ ఫ్యాన్ అయినా వీడియో తీయాలని చూస్తాడు. అలాగే ఇక్కడ కూడా ఒక అభిమాని వీడియో తీయడానికి ముందుకు వచ్చి.. ఆ సాంగ్ ను రికార్డ్ చేస్తున్నాడు. ఇక ఆ రికార్డ్ ను చూసిన ఆదిత్య ఆ అభిమానిని కొట్టి, ఫోన్ లాక్కొని దూరంగా విసిరేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ఇక ఈ వీడియోపై అభిమానులు మండిపడుతున్నారు. వరస్ట్ బిహేవియర్ ఆదిత్య.. ఇలా చేసి ఉండాల్సింది కాదని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ దురుసు ప్రవర్తన ఆదిత్యకు కొత్తేమి కాదు. అందుకే ఇతను సింగర్ గా కన్నా వివాదాలతోనే ఎక్కువ ఫేమస్ అయ్యాడు. ఇప్పుడు మళ్లీ ఇలా అభిమాని కొట్టి మరో వివాదాన్ని కొనితెచ్చుకున్నాడు. దీంతో అభిమానులు అతడి ప్రవర్తన మంచిది కాదని, తండ్రి పేరు మీద బతికే వ్యక్తికీ అంత పొగరు ఎందుకు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ వీడియోపై ఉదిత్ నారాయణ్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

Show comments