Prabhas:”దురంధర్” దర్శకుడితో ప్రభాస్ మూవీ… ఆ హీరోలకు దక్కని ఛాన్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prabhas : ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత బిజీ స్టార్ హీరో ఎవరంటే చాలా మంది ప్రభాస్ పేరే చెబుతారు. వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లు, భారీ బడ్జెట్ చిత్రాలు, దేశవ్యాప్తంగా ఉన్న అభిమాన వర్గం కారణంగా ఆయనతో సినిమా చేయాలనే ఆసక్తి ప్రతి దర్శకుడిలో కనిపిస్తోంది. ఇప్పుడు అలాంటి జాబితాలో మరో ప్రముఖ దర్శకుడు చేరినట్లు బాలీవుడ్ వర్గాల్లో చర్చ సాగుతోంది. ‘ధురంధర్ 2: ది రివెంజ్’ తర్వాత దర్శకుడు ఆదిత్య ధర్ తదుపరి ప్రాజెక్ట్ కోసం ప్రభాస్‌తో చేతులు కలపాలని ఆసక్తిగా ఉన్నారనే వార్తలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
ఇటీవలి కాలంలో ఆదిత్య ధర్ పేరు మళ్లీ బాలీవుడ్లో బలంగా వినిపిస్తోంది. తన చిత్రాల ద్వారా యాక్షన్, ఎమోషన్, దేశభక్తి అంశాలను ప్రేక్షకులకు ఆకట్టుకునే విధంగా చూపించిన ఆయన, ప్రస్తుతం తెరకెక్కిస్తున్న ‘ధురంధర్ 2: ది రివెంజ్’ తో తన మార్కెట్ ను మరో స్థాయికి తీసుకెళ్లారు. ఈ సినిమా తర్వాత పలువురు బాలీవుడ్ హీరోలు మాత్రమే కాకుండా దక్షిణాది స్టార్ హీరోలు కూడా ఆయనను సంప్రదించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అందరి కంటే ప్రభాస్‌తో సినిమా చేయడంపైనే ఆయన ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని సమాచారం. ప్రభాస్ కు ప్రస్తుతం ఉన్న ఫేమ్ కూడా ఈ ఆసక్తికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ కేవలం తెలుగు హీరోగా కాకుండా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయారు. అరుదైన హీరోల్లో ప్రభాస్ ఒకరిగా నిలిచారు.
Also Read
- Scene Movie: "హీరోలు చాలు.. ఒక విలన్ కావాలి! లోకేష్‌తో రోలెక్స్ ప్లాన్ నడుస్తోంది": సూర్య
- Dada: రక్తపాతం లేని రచ్చ.. బాలయ్య వర్సెస్ మనోజ్ ‘దాదా’ వార్!
- Sivakarthikeyan: డైరెక్టర్‌కు కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన హీరో.. సర్ప్రైజ్ మామూలుగా లేదుగా!
- Tollywood: ఒకే ఒక్క ఫ్లాప్.. ప్రశ్నార్థకంగా మారిన స్టార్ డైరెక్టర్ల భవిష్యత్తు!
భారీ కాన్సెప్ట్‌లు, పాన్ ఇండియా కథలు, అంతర్జాతీయ స్థాయి యాక్షన్ డ్రామాలకు ఆయన బ్రాండ్ గా మారిపోయారు. దేశంలోని దాదాపు ప్రతి అగ్ర దర్శకుడు కనీసం ఒక్కసారి అయినా ప్రభాస్‌తో సినిమా చేయాలని కోరుకోవడం కూడా ఇదే కారణం. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఇప్పటికే పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లు ఉన్నప్పటికీ, ఆదిత్య ధర్‌తో కలయిక నిజమైతే అది మరో క్రేజీ కాంబినేషన్‌గా మారే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ బాలీవుడ్లో వినిపిస్తున్న ఈ వార్తలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఒకవేళ ఆదిత్య ధర్, ప్రభాస్ కలయిక నిజమైతే యాక్షన్ ప్రియులకు మరో భారీ విజువల్ ట్రీట్ దక్కే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఈ వార్తపై సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజావార్తలు
-
Chairman’s Desk : కేంద్రం అనవసరంగా సర్‌ను వివాదం చేసుకుందా? ప్రతిపక్షాలు ఈ టెంపోను కొనసాగించగలవా?
-
Scene Movie: “హీరోలు చాలు.. ఒక విలన్ కావాలి! లోకేష్‌తో రోలెక్స్ ప్లాన్ నడుస్తోంది”: సూర్య
-
Diwali Lunch Menu Ideas : దీపావళి విందు స్పెషల్.. ఈ వెజ్ మెనూతో అదరగొట్టండి
-
OTR: తెలంగాణపై బీజేపీ మిషన్ స్టార్ట్.. అమిత్ షా సమరశంఖం
-
Off The Record: గులాబీ పార్టీలో కొత్త తలనొప్పులు.. మాజీ ఎమ్మెల్యేల సీట్లకే ఎసరు?
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!