Site icon NTV Telugu

Siddharth- Aditi Rao Hydari: సిద్దార్థ్ తో అదితి డేటింగ్.. అడ్డంగా కెమెరాకు దొరికి..?

Siddu

Siddu

Siddharth- Aditi Rao Hydari: చిత్ర పరిశ్రమ అంటేనే గ్లామర్ ప్రపంచం.. ఇందులో ఉన్నవారి గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటూనే ఉంటారు. హీరో హీరోయిన్ల మధ్య రిలేషన్ .. స్నేహమే అయినా, ప్రేమ అయినా గాసిప్స్ మాత్రం పుట్టుకొచ్చేస్తాయి. అదే జంటగా కెమెరా కంటికి కనిపిస్తే అంతే సంగతులు.. కథలు అల్లేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేస్తూ ఉంటారు. తాజాగా ఒక హీరో హీరోయిన్ ఇద్దరూ కలిసి ముంబై వీధుల్లో చక్కర్లు కొట్టడం, కెమెరా కంటికి చిక్కడంతో ఈ జంట మధ్య ఏం జరుగుతుంది అని ఆరాలు తీయడం మొదలయ్యింది. ఆ జంట వేరెవరో కాదు.. సీనియర్ హీరో సిద్దార్థ్, హీరోయిన్ అదితి రావ్ హైదరి. వీరిద్దరూ కలిసి తెలుగులో మహా సముద్రం చిత్రంలో నటించారు.

అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇక ఈ సినిమా నుంచి వీరి మధ్య పరిచయం ఏర్పడిందని, అది కాస్తా డేటింగ్ వరకు వెళ్లిందని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ముంబైలోని ఒక సెలూన్ కు ఈ జంట కలిసి వెళ్లి రావడం కెమెరాల కంట పడింది. అంతేకాకుండా మీడియా పై సిద్దార్థ్ కొద్దిగా రూడ్ గా మాట్లాడడం హాట్ టాపిక్ గా మారింది. సెలూన్ నుంచి బయటికి వచ్చిన అదితి.. కెమెరాలకు ఫోజులిచ్చి కారులో కూర్చోగా.. సిద్దు మాత్రం చిరాకుగా నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండదు.. దయచేసి వెళ్లిపోండి.. విసిగించకండి అంటూ మాట్లాడడం వారిని అవమానించినట్లే అని నెటిజన్లు అంటున్నారు. ఇక మరికొంతమంది సెలూన్ కు వెళ్తే తప్పేంటి..? వారు డేటింగ్ లో ఉన్నారని ఎలా చెప్తారు అని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే వీరు నిజంగా డేటింగ్ లో ఉన్నారా..? లేక స్నేహితులా..? అనేది తెలియాల్సి ఉంది.

Exit mobile version