Prabhas: ‘ఆదిపురుష్’ టీజర్ విడుదలకు ముహూర్తం ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adipurush Teaser: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తొలి త్రీడీ, పౌరాణిక పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’. వచ్చే ఏడాది జనవరి 12వ తేదీ ఈ సినిమా వివిధ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ ‘ఆదిపురుష్’ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తో దర్శకుడు ఓంరౌత్ బిజీబిజీగా ఉన్నారు. అయితే ‘రాధేశ్యామ్’ పరాజయంతో కాస్తంత స్తబ్దుగా ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ ను అతి త్వరలోనే చైతన్య పరచడానికి ఆయన సన్నాహాలు మొదలెట్టారు. అలానే ప్రభాస్ సైతం తన పెదనాన్న కృష్ణంరాజు కన్నుమూయడంతో కాస్తంత లో-ప్రొఫైల్ మెయిన్ టైన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఫిల్మ్ సిటీలో జరుగుతున్న ‘సలార్’ మూవీ షూటింగ్ లో ప్రభాస్ పాల్గొంటున్నారనే వార్తలు వస్తున్నా.. వారు మాత్రం దీనిని అధికారికంగా ధృవీకరించడం లేదు. ఇదే సమయంలో ‘ఆదిపురుష్’ చిత్రానికి సంబంధించిన అప్ డేట్ వారం క్రితమే వచ్చింది.
Read Also: AHA: ‘రేయికి వేయి కళ్ళు’ అంటున్న అరుళ్‌నిధి స్టాలిన్
Also Read
- Aishwarya Lekshmi: బన్నీ - అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
- Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! 'జై హనుమాన్' అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
- Akshara Haasan: "టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా".. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
- Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేతుల మీదుగా ‘ఆదిపురుష్’ టీజర్ ను అయోధ్యలో త్వరలో విడుదల చేయబోతున్నారని మేకర్స్ అప్పట్లో తెలిపారు. అయితే ఆ విడుదల తేదీని మంగళవారం ఓంరౌత్ అధికారికంగా తెలిపాడు. అక్టోబర్ 2న ఈ టీజర్ ఆవిష్కరణ ఉంటుందని ప్రకటించాడు. సరయూ నది అలల గలల నడుమ ‘ఆదిపురుష్’ టీజర్’ విడుదల అవుతుందని, తమ ప్రాజెక్ట్ కు సంబంధించిన టీజర్ ను ప్రతి ఒక్కరూ అనుభూతి చెందవచ్చని ఓం రౌత్ పేర్కొన్నాడు. ప్రభాస్, కీర్తిసనన్, సైఫ్ అలీఖాన్, సన్నీసింగ్, దేవదత్త నాగే, వత్సల్ సేథ్, సోనాల్ చౌహాన్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాను భూషన్ కుమార్, కిషన్ కుమార్, ఓమ్ రౌత్, ప్రసాద్ సత్తార్, రాజేశ్ నాయర్ నిర్మిస్తున్నారు.
Our magical journey is now yours to experience & love! ✨
The much awaited #AdipurushTeaser and the first poster of our film will be launched on Oct. 2!
Venue – Bank Of Sarayu, Ayodhya, UP! #Adipurush releases IN CINEMAS on January 12, 2023 in IMAX & 3D! pic.twitter.com/D5MPSHjcsn— Om Raut (@omraut) September 27, 2022
తాజావార్తలు
-
Aishwarya Lekshmi: బన్నీ – అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
-
Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
-
Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
-
Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!