Site icon NTV Telugu

Prabhas: ‘ఆదిపురుష్’ టీజర్ విడుదలకు ముహూర్తం ఫిక్స్

Adipurush

Adipurush

Adipurush Teaser: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తొలి త్రీడీ, పౌరాణిక పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్‌’. వచ్చే ఏడాది జనవరి 12వ తేదీ ఈ సినిమా వివిధ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ ‘ఆదిపురుష్‌’ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తో దర్శకుడు ఓంరౌత్ బిజీబిజీగా ఉన్నారు. అయితే ‘రాధేశ్యామ్’ పరాజయంతో కాస్తంత స్తబ్దుగా ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ ను అతి త్వరలోనే చైతన్య పరచడానికి ఆయన సన్నాహాలు మొదలెట్టారు. అలానే ప్రభాస్ సైతం తన పెదనాన్న కృష్ణంరాజు కన్నుమూయడంతో కాస్తంత లో-ప్రొఫైల్ మెయిన్ టైన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఫిల్మ్ సిటీలో జరుగుతున్న ‘సలార్’ మూవీ షూటింగ్ లో ప్రభాస్ పాల్గొంటున్నారనే వార్తలు వస్తున్నా.. వారు మాత్రం దీనిని అధికారికంగా ధృవీకరించడం లేదు. ఇదే సమయంలో ‘ఆదిపురుష్‌’ చిత్రానికి సంబంధించిన అప్ డేట్ వారం క్రితమే వచ్చింది.

Read Also: AHA: ‘రేయికి వేయి కళ్ళు’ అంటున్న అరుళ్‌నిధి స్టాలిన్

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేతుల మీదుగా ‘ఆదిపురుష్‌’ టీజర్ ను అయోధ్యలో త్వరలో విడుదల చేయబోతున్నారని మేకర్స్ అప్పట్లో తెలిపారు. అయితే ఆ విడుదల తేదీని మంగళవారం ఓంరౌత్ అధికారికంగా తెలిపాడు. అక్టోబర్ 2న ఈ టీజర్ ఆవిష్కరణ ఉంటుందని ప్రకటించాడు. సరయూ నది అలల గలల నడుమ ‘ఆదిపురుష్‌’ టీజర్’ విడుదల అవుతుందని, తమ ప్రాజెక్ట్ కు సంబంధించిన టీజర్ ను ప్రతి ఒక్కరూ అనుభూతి చెందవచ్చని ఓం రౌత్ పేర్కొన్నాడు. ప్రభాస్, కీర్తిసనన్, సైఫ్‌ అలీఖాన్, సన్నీసింగ్, దేవదత్త నాగే, వత్సల్ సేథ్, సోనాల్ చౌహాన్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాను భూషన్‌ కుమార్, కిషన్ కుమార్, ఓమ్ రౌత్, ప్రసాద్ సత్తార్, రాజేశ్ నాయర్ నిర్మిస్తున్నారు.

Exit mobile version