NTV Telugu Site icon

Adipurush: ప్రభాస్ బర్త్ డే కానుక.. ‘ఆదిపురుష్’ నుంచి స్పెషల్ పోస్టర్

Adi Purush

Adi Purush

Adipurush: రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సంబరాలు ప్రారంభమయ్యాయి. ఆదివారం నాడు ప్రభాస్ బర్త్ డే సందర్భంగా అతడి అభిమానులకు ఆదిపురుష్ యూనిట్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఈ మేరకు స్పెషల్ పోస్టర్ విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో రాముడి లుక్‌లో ప్రభాస్ ఆకట్టుకుంటున్నాడు. విల్లును పట్టుకుని బాణాన్ని సంధించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తున్న ప్రభాస్‌ను చూసి అతడి అభిమానులు మురిసిపోతున్నారు. రామాయ‌ణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఓంరౌత్ ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నాడు.

Read Also: Sanjay Dutt: బాలీవుడ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంజయ్ దత్

ఇప్పటికే రిలీజైన ఆదిపురుష్ టీజర్ రికార్డులు సృష్టించింది. అయితే కొందరు యానిమేషన్ సినిమా అని విమర్శలు కూడా చేశారు. అయినా ఈ సినిమా అందరికీ నచ్చుతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ సినిమాలో సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. మోష‌న్ క్యాప్చర్ టెక్నాల‌జీతో పాటు త్రీడీ, ఐమాక్స్ వెర్షన్స్‌లో దాదాపు రూ.500 కోట్ల వ్యయంతో ఆదిపురుష్ సినిమా రూపొందుతోంది. వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 12న ఆది పురుష్ రిలీజ్ కానుంది. తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్నడ‌, హిందీ భాష‌ల్లో ఈ సినిమా భారీ ఎత్తున రిలీజ్ కానుంది.